
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న వారణాసి చిత్రంతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ద్వారా మహేష్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారడం ఖాయమనే అంచనాలున్నాయి. అయితే, ఈ భారీ ఇమేజ్‌ను కొనసాగిస్తూ, రాజమౌళి సినిమా తర్వాత ఎదురయ్యే సెంటిమెంట్‌ను బ్రేక్ చేయడానికి మహేష్ తదుపరి ఎవరితో సినిమా చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, మహేష్ బాబు తదుపరి చిత్రాల కోసం పలువురు ప్రముఖ దర్శకులు రేసులో ఉన్నారు. ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగ. మహేష్‌లోని మాస్ యాంగిల్‌ను నెక్స్ట్ లెవెల్‌లో చూపించేందుకు వంగ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. వీరిద్దరి కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద వరల్డ్ బాంబ్ పేలినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మహేష్ కూడా సందీప్ తో సినిమా చేసేందుకు దాదాపు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.మరోవైపు, బుచ్చిబాబు సానా మహేష్ కోసం ఒక ఎమోషనల్ మరియు పవర్‌ఫుల్ స్టోరీ లైన్ సిద్ధం చేశారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ మేకర్ ఆదిత్య ధర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం మాయమైపోతున్న మాన్‌సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్ బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం జాహ్నవి తిరిగొస్తుందా? జ్ఞాని తిమ్మప్ప సంచలన వ్యాఖ్యలు