
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Vaibhav Sooryavanshi Not Playing: రాబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆశిస్తున్నారు. ఐర్లాండ్‌పై జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున ఈ యువ ఆటగాడు అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ, కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను జట్టులో కొనసాగించాలని నిర్ణయించున్నాట్లు తెలిసింది. దీంతో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఆడేందుకు ఛాన్స్ రాలేదు. అయితే రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్‌కు ఆడే ఛాన్స్ ఇస్తారని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇటీవలే జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 700కు పైగా పరుగులు సాధించి ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వైభవ్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేస్తారని అంతా భావించారు. కానీ, అతడిని పక్కన పెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్ ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గేలకు తొలి మ్యాచ్ ఆడే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో వైభవ్ సూర్యవంశీ మరికొన్ని రోజులు వేచి చూడక తప్పడం లేదు. టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరినప్పుడు వైభవ్ సూర్యవంశీకి తుదిజట్టులో అవకాశం వస్తుందని తాను భావించినట్లు సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే అభిషేక్ శర్మ లేదా సంజు సాంసన్‌లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి సూర్యవంశీ ఓపెనర్‌గా అవకాశం సునీల్ అన్నారు. ఈ విధంగా చేస్తే వైభవ సూర్యవంశం రెండు మ్యాచ్‌లు ఆడించే