
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Vaibhav Sooryavanshi Fall Down: బంతి పడగానే చాలు బ్యట్‌తో బాదితే బౌండరీ లైన్ దాటాల్సిందే. ఐపీఎల్ 2026లో ఫోర్లు, సిక్సర్లతో విజృంభించే వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రస్తుతం పరుగులు తీసేందుకే తడబడుతున్నాడు. డబుల్ డిజిట్ పరుగులు తీసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఏ సిరీస్‌లో వైభవ్ అతి తక్కువ పరుగులు నమోదు చేశాడు. అర్ధ సెంచరీ కూడా పూర్తి చేయలేకపోయాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 776 పరుగులు సాధించాడు. ఫోర్లు సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. అతడి అద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ అతడిని భారతీయ జట్టులో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే శ్రీలంకతో జరిగిన ఏ సిరీస్‌లో మాత్రం వైభవ్ ప్రభవం చూపలేకపోయాడు. ఈ మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న అతడు ఈ సిరీస్‌లో విఫలమవడం ఆందోళన రేపుతోంది. ఐపీఎల్ తర్వాత జరిగిన సిరీస్‌లో వైభవ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 14, 44, 21 పరుగులు నమోదు చేశాడు. ఈ స్థాయిలో పేలవ ప్రదర్శన చేయడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్‌లకు ముందు ఫామ్ కోల్పోవడంతో వైభవ్‌కు ఏమైందని అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగులు చేశాడు. శ్రీలంక కెప్టెన్ సహన్ అరచ్చిగే తన స్పిన్‌తో