వింబుల్డన్ సింగిల్స్ లోనూ సెరెనా
Actor ProfileCelebrity

వింబుల్డన్ సింగిల్స్ లోనూ సెరెనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వింబుల్డన్ సింగిల్స్ లోనూ సెరెనా
Sakshi3 Jul 2026
వింబుల్డన్ సింగిల్స్ లోనూ సెరెనా

లండన్‌: నాలుగేళ్ల తర్వాత మళ్లీ రాకెట్‌ పట్టిన అమెరికా దిగ్గజ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌లో రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఈనెల 29 నుంచి జరిగే ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో 44 ఏళ్ల సెరెనా సింగిల్స్‌ విభాగంలోనూ బరిలోకి దిగనుంది. ఈ మేరకు వింబుల్డన్‌ టోర్నీ నిర్వాహకులు చివరిదైన ఎనిమిదో వైల్డ్‌ కార్డును సెరెనాకు కేటాయిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. తన సోదరి వీనస్‌ విలియమ్స్‌తో కలిసి సెరెనా వింబుల్డన్‌ మహిళల డబుల్స్‌ విభాగంలోనూ ఆడేందుకు ఇంతకుముందే వైల్డ్‌ కార్డు ఇచ్చారు. తాజా ప్రకటనతో సెరెనా సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో పోటీపడనుంది. చివరిసారి 2022లో వింబుల్డన్‌ టోర్నీలో ఆడిన సెరెనా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. అదే ఏడాది ఆటకు గుడ్‌బై చెప్పిన సెరెనా ఇటీవల పునరాగమనం చేసింది. సెరెనా తన కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గింది. ఆమె అత్యధికంగా ఏడుసార్లు చొప్పన వింబుల్డన్, ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సొంతం చేసుకోగా... ఆరుసార్లు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ను, మూడుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ను సాధించింది. అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు) మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు) సిల్వర్‌ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్ ‘హను మాన్‌ 3డీ’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..! మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు