వెనెజువెలా భూకంపాన్ని ముందే హెచ్చరించిన స్మార్ట్ ఫోన్లు
Actor ProfilePolitician

వెనెజువెలా భూకంపాన్ని ముందే హెచ్చరించిన స్మార్ట్ ఫోన్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెనెజువెలా భూకంపాన్ని ముందే హెచ్చరించిన స్మార్ట్ ఫోన్లు
Andhra Jyothy20 Jul 2026
వెనెజువెలా భూకంపాన్ని ముందే హెచ్చరించిన స్మార్ట్ ఫోన్లు

వెనెజువెలా దేశంలో బుధవారం రాత్రి పెను భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు శక్తిమంతమైన భూకంపాల ధాటికి అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. కాగా.. ఈ ప్రమాదం సంభవించడానికి కొన్ని క్షణాల ముందు గూగుల్‌ పలు స్మార్ట్‌ఫోన్లకు దీని గురించి అలర్ట్‌లు పంపిందని తాజాగా తెలుస్తోంది. ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి విపత్తులు ఎప్పుడు, ఏ రూపంలో వస్తాయో ఎవ్వరం ఊహించలేము. ముఖ్యంగా భూకంపాలు, సునామీ లాంటి ప్రకృతి విపత్తులు క్షణాల వ్యవధిలోనే పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. అయితే, సాంకేతికత సరిగ్గా పనిచేస్తే.. కొన్ని క్షణాల ముందస్తు సమాచారమే వేలాది మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆ మాటలను వెనెజువెలాలో జరిగిన భూకంప సంఘటన నిరూపించింది. ఈ పెను భూకంపం సంభవించడానికి కొన్ని సెకన్ల ముందే గూగుల్ పలు ఆండ్రాయిడ్ మొబైల్స్ అలర్ట్ పంపినట్లు తాజాగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 'భూకంపం వస్తోంది.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి' అంటూ గూగుల్ పంపిన అలర్ట్ మెసేజ్ చూసి ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యారు. తీవ్రమైన ప్రకంపనలు మొదలయ్యేలోపే సురక్షిత ప్రాంతాలకు చేరుకోగలిగారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ అలర్ట్ వచ్చినట్లు సమాచారం. గూగుల్ సంస్థ భూకంపం వస్తుందని ముందుగా జోస్యం చెప్పలేదు. కేవలం భూమి పొరల్లో మొదలైన తొలి ప్రకంపనల సంకేతాలను అత్యంత వేగంగా గుర్తించి.. ఆ ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసింది. గూగుల్ రూపొందించిన 'ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్' (Android Earthquake Alerts System) ద్వారా ఇది సాధ్యమైంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో 'మోషన్ సెన్సార్లు' (యాక్సిలెరోమీటర్లు) ఉంటాయి. భూమిలో వచ్చే అతి సూక్ష్మమైన కదలికలను కూడా ఇవి గుర్తిస్తాయి. ఒకే ప్రాంతంలో వేలాది ఫోన్లు ఇలాంటి కదలికలను ఒకేసారి నమోదు చేసినప్పుడు, గూగుల్ క్లౌడ్ నెట్‌వర్క్ దానిని భూకంపంగా గుర్తించి, వెంటనే ఆ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు పంపుతుంది. భూకంప తీవ్రతను