
ఇంటర్నెట్ డెస్క్: లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాలో సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ విలయంలో మృతులు అంతకంతకూ పెరుగుతుండగా గల్లంతైన వారి సంఖ్య వేలల్లో ఉండటం విచారకరం. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 235 మంది బలైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరో 4300 మంది గాయపడినట్లు తెలిపింది. భవన శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకున్నట్లు పేర్కొంది. ఈ వరుస భూకంపాల (Venezuela earthquake) అనంతరం దాదాపు 40వేల మంది జాడ తెలియరాలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెనెజువెలా (Venezuela) రాజధాని కారకాస్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ భూప్రకంపనలు సంభవించాయి. అయితే, అత్యంత తీవ్రంగా ప్రభావితమైన లా గువేరాలో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. భూకంపం ధాటికి ఈ తీర నగరం అతలాకుతలమైంది. ఇక్కడ 100కు పైగా భవనాలు నేలమట్టమైనట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న ఐరాస ప్రతినిధులు వెల్లడించారు. వీటి కింద చిక్కుకున్నవారిని గుర్తించడం కూడా కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. శిథిలాలను తొలగించడానికి చాలా సమయం పడుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 250 బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా శిథిలాల దిబ్బగా మారినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వెల్లడించారు. భూకంపం (Earthquake) నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఐరాస ప్రతినిధులు వెనెజువెలా ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియాతో ప్రజలు కీలక సమాచారాన్ని వేగంగా తెలుసుకోగలుగుతారని పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో వెనెజువెలా పౌరులకు ‘ఎక్స్’ అందుబాటులోకి వచ్చింది. 2024లో మదురో అధికారంలో ఉన్నప్పుడు ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ క్లిష్ట సమయంలో వెనెజువెలాను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. 150 మిలియన్ డాలర్ల విలువైన సహాయక సామగ్రిని అందిస్తామని అమెరికా ప్రకటించింది. దీన్ని