వెనిజులాలో రెండు వరుస భూకంపాల
Actor ProfilePolitician

వెనిజులాలో రెండు వరుస భూకంపాల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెనిజులాలో రెండు వరుస భూకంపాలపై అధికారుల అంచనా
Samayam Telugu20 Jul 2026
వెనిజులాలో రెండు వరుస భూకంపాలపై అధికారుల అంచనా

Venezuela Doublet Earthquakes : దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో బుధవారం రాత్రి ప్రకృతి దాల్చిన ఉగ్రరూపం గురించి అందరికీ తెలిసిందే. రాజధాని కారకాస్ సమీపంలో కేవలం 39 సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు అత్యంత శక్తివంతమైన జంట భూకంపాలు దేశం మొత్తాన్ని అతలాకుతలం చేశాయి. మొదట రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో ప్రకంపనలు రాగా.. తదుపరి క్షణాల్లోనే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం దూసుకొచ్చింది. శతాబ్ద కాలంలో దేశంలో ఎన్నడూ ఎరుగని ఈ మహా విపత్తు ధాటికి వందలాది భవనాలు నిలువునా కూలిపోయాయి. ఈ ఘోర పరిణామాల నేపథ్యంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ దేశవ్యాప్తంగా ‘అత్యవసర స్థితి’ ప్రకటించారు.39 సెకన్ల వ్యవధిలో ‘ఫోర్‌షాక్, మెయిన్‌షాక్’యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) నివేదిక ప్రకారం.. కారకాస్‌కు పశ్చిమంగా 168 కిలో మీటర్ల దూరంలోని మొరాన్ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదైంది. మొదటి భూకంపం 7.2 తీవ్రతతో భూగర్భంలో 21.9 కిలోమీటర్ల లోతులో సంభవించగా.. దానిని ఫోర్‌షాక్‌గా గుర్తించారు. ఆ తర్వాత కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే 10 కిలోమీటర్ల లోతులో 7.5 తీవ్రతతో 'మెయిన్‌షాక్' విరుచుకుపడింది. దీని తర్వాత మరో 20 సార్లకు పైగా చిన్నపాటి ప్రకంపనలు రావడంతో ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రస్తుతం ప్రాథమికంగా 32 మంది మరణించినట్లు, 700 మందికి పైగా గాయపడినట్లు ప్రభుత్వం ధృవీకరించినప్పటికీ.. మరణాల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండే ప్రమాదం ఉందని యూఎస్‌జీఎస్ అంచనా వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత.. కూలిన పైకప్పు!భూకంపం ధాటికి వెనిజులా ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయ 'సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం' (సీసీఎస్) తీవ్రంగా దెబ్బతింది. టెర్మినల్ లోపల ప్రయాణికులు లగేజీలతో పరుగులు తీస్తుండగానే ఎయిర్‌పోర్ట్ పైకప్పులో కొంత భాగం ఒక్కసారిగా కూలిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో.. విమానాశ్రయం అంతా చీకటి, ధూళి మేఘాలతో నిండిపోయింది. మౌలిక

వ న జ ల ల ర డ వర స భ క ప ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in