వీధిదీపాలు వెలగకపోతే.. కాంట్రాక్టర్లకు డబ్బులు బంద్
Actor ProfileCelebrity

వీధిదీపాలు వెలగకపోతే.. కాంట్రాక్టర్లకు డబ్బులు బంద్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వీధిదీపాలు వెలగకపోతే.. కాంట్రాక్టర్లకు డబ్బులు బంద్
Samayam Telugu29 Jun 2026
వీధిదీపాలు వెలగకపోతే.. కాంట్రాక్టర్లకు డబ్బులు బంద్

Delhi Smart Streetlight Project : ప్రజా మౌలిక సదుపాయాల కల్పనలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ఢిల్లీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరంలోని వీధి దీపాలను అత్యాధునిక సాంకేతికతతో ఆధునీకరించేందుకు రూ. 473 కోట్ల భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ ప్రాజెక్టులో కేవలం నిధులు కేటాయించడమే కాకుండా.. "నో పెర్ఫార్మెన్స్, నో పేమెంట్" (పనితీరు బాగుంటేనే నిధుల విడుదల) అనే సరికొత్త జవాబుదారీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. కాంట్రాక్టర్లు అమర్చిన వీధిదీపాలు నిరంతరం వెలుగుతూ, పక్కాగా పని చేస్తేనే వారికి ప్రభుత్వం నుంచి డబ్బులు అందుతాయి.ఏంటీ కొత్త పేమెంట్ మోడల్..?సాధారణంగా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పనులు ప్రారంభించేటప్పుడు లేదా పూర్తి చేసిన వెంటనే పెద్ద మొత్తంలో అడ్వాన్స్ నిధులు విడుదల అవుతుంటాయి. ఆ తర్వాత సదరు మౌలిక సదుపాయాల నిర్వహణను కాంట్రాక్టర్లు గాలికి వదిలేస్తుంటారు. ఈ లొసుగును అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద టెండర్లు దక్కించుకున్న సంస్థలే వీధి దీపాలను అమర్చడంతో పాటు వాటి దీర్ఘకాలిక నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాలి. ప్రభుత్వం వీరికి ఒకేసారి కాకుండా నెలవారీ వాయిదాల పద్ధతిలో నిధులను విడుదల చేస్తుంది. నిర్ణీత ప్రమాణాల ప్రకారం వీధిదీపాలు వెలగకపోయినా, సాంకేతిక లోపాలు తలెత్తినా కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి నిధులను కట్ చేస్తారు. దీనివల్ల కేవలం లైట్లు ఇన్‌స్టాల్ చేయడంపైనే కాకుండా అవి నిరంతరం పని చేసేలా చూడటంపై కాంట్రాక్టర్లు శ్రద్ధ పెట్టక తప్పదు.96,000 స్మార్ట్ ఎల్‌ఈడీ లైట్లు..!ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) పరిధిలోని సుమారు 1,400 కిలో మీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారులు, కారిడార్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లలో ఈ ప్రాజెక్టును విస్తరించనున్నారు. ప్రస్తుతం నగరంలోని 51,000 పైగా పోల్స్‌పై దాదాపు 96,000 వీధిదీపాలు ఉన్నాయి. ఇవన్నీ పాతకాలపు లైట్లు కావడం, కాలం చెల్లిన మౌలిక సదుపాయాలు

వ ధ ద ప ల వ లగకప త క ట ర క టర లక డబ బ ల బ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in