
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలు, వివిధ గురుకులాలు కస్తూర్బా గాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులందరికీ బ్రాండెడ్ నాణ్యతతో కూడిన కిట్లను సరఫరా చేయనుంది. ఈ బ్రాండెడ్ కిట్లు వారికి నాణ్యమైన పాఠ్య వనరులను అందిస్తాయి.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే భారీ ప్రాజెక్ట్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 687.78 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా సుమారు 27 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ కిట్లలో రెండు జతల యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, టైలు, బెల్టులు వంటి అనేక అంశాలు ఉంటాయి. అంతేకాకుండా బెడ్డింగ్ సామగ్రి, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు వంటి ఇతర అవసరమైన వస్తువులను కూడా అందజేయనున్నారు.విద్యార్థులందరికీ బ్రాండెడ్ యూనిఫాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నాణ్యతకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల పంపిణీలో ఎలాంటి తేడాలు లేకుండా అందరు విద్యార్థులకు సమానంగా బ్రాండెడ్ వస్తువులు అందుతాయి. ఈ సంవత్సరం యూనిఫాం రంగుల్లో కూడా ముఖ్యమైన మార్పులు చేశారు. డే స్కాలర్స్‌కు టాప్ లైట్ బ్లూ, లోయర్ డార్క్ బ్లూ రంగులు, గురుకుల విద్యార్థులకు మెరూన్ చెక్ టాప్, మెరూన్ లోయర్ రంగులు కేటాయించారు.యూనీఫాం లు కుట్టే పని మహిళా సంఘాలకు విద్యార్థినులకు స్కర్ట్, పంజాబీ డ్రెస్, చున్నీలు కూడా అందించనున్నారు. యూనిఫాంల కుట్టు పనులను పూర్తిగా మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించారు. రోజుకు 75వేల నుంచి ఒక లక్ష యూనిఫాంలు కుట్టగల సామర్థ్యం ఉన్న ఈ సంఘాలకు ఒక్కో యూనిఫాంకు రూ.75 చొప్పున చెల్లింపు జరుగుతుంది. దీని ఫలితంగా మహిళా సంఘాలకు సుమారు రూ.40కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇక