
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Breakfast Scheme: వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు పున: ప్రారంభం కానున్నాయి. అయితే మొదటి రోజు నుంచే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో జూన్ 15వ తేదీ, సోమవారం నుంచి బ్రేక్ ఫాస్ట్ పథకానికి అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఇక మొదటి విడతలో 8 జిల్లాలైన వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరిలో.. 1,269 పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీల్లో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఈ విడతలో 1,44,610 మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22 లక్షల మందికి విడతల వారీగా విస్తరించనున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ, మిల్లెట్ ఇడ్లీ, పూరీ, బోండా, ఉప్మాను వడ్డించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో.. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొత్తం 33 జిల్లాల్లో 39 చోట్ల సెంట్రలైజ్డ్ కిచెన్ల నిర్మాణానికి రూ. 299.90 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో ఇప్పటికే ఉన్న ఏడు కిచెన్లను ఆధునీకరిస్తారు. మిగిలినవి కొత్తగా నిర్మించనున్నారు. అయితే, ఒక్కో కిచెన్ నిర్మాణానికి ప్రభుత్వం 70 శాతం భరిస్తుంది. మిగిలిన 30 శాతం స్వచ్ఛంద సంస్థలు ఖర్చు చేయనున్నాయి. ప్రస్తుతం 8 జిల్లాల్లో బ్రేక్ పాస్ట్ పథకాన్ని హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్, మన్నా ట్రస్ట్‌లు అమలు చేయనున్నాయి. మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి