వంద దేవుళ్ళు మూవీ రివ్యూ
Actor ProfileActor

వంద దేవుళ్ళు మూవీ రివ్యూ

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources4
వంద దేవుళ్ళు మూవీ రివ్యూ
Chitrajyothy19 Jun 2026
వంద దేవుళ్ళు మూవీ రివ్యూ

విజయ్‌ ఆంటోనీ, శశి కాంబినేషన్‌లో 'బిచ్చగాడు' తర్వాత వచ్చిన సినిమా 'వంద దేవుళ్ళు'. అమ్మకు పెళ్ళి కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు, దర్శక నిర్మాత విజయ్ ఆంటోని (Vijay Antony) ఏ సినిమా చేసినా... అందులో అర్థం, పరమార్థం ఉంటుంది. కేవలం కమర్షియల్‌ పర్పస్‌తో సినిమాలు చేయడం ఆయనకు అలవాటు లేని పని. ఇంతవరకూ నటుడిగా తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి సొంత సినిమాలు తీసిన విజయ్‌ ఆంటోని ఇప్పుడు తాను బ్యాక్‌ సీట్‌ లో కూర్చుని కథకు పెద్ద పీట వేస్తూ నిర్మించిన సినిమా 'వంద దేవుళ్ళు'. విజయ్‌ ఆంటోనితో 'బిచ్చగాడు' (Bichagadu) వంటి బ్లాక్ బస్టర్ మూవీని చేసిన శశి (Sasi) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. వాసవి (స్వాసిక Swasika) ఇద్దరు పిల్లల తల్లి. యుక్తవయసులోనే భర్తను పోగొట్టుకుంటుంది. అక్కడి నుంచి పిల్లలే జీవితంగా గడుపుతుంది. వితంతువు వాసవి అంటే ఊరిలో మగాళ్ళందరికీ అలుసే. అవకాశం కోసం గోతి కాడ నక్కల్లా కాచుకుని ఉంటారు. అయినా నిబ్బరంగా జీవితాన్ని సాగిస్తుందామె. ఇద్దరు మగపిల్లలు భాస్కర్‌ (అజయ్‌ దిషాన్‌ Ajay Dishan), వివేక్‌ (శక్తి Shakthi) పెళ్ళికి ఎదిగిన తర్వాత తనకూ ఓ తోడు కావాలనే భావన ఆమెలో కలుగుతుంది. అయితే ఆ నిర్ణయాన్ని తొలుత ఆమోదించని కొడుకులిద్దరూ ఆ తర్వాత మనసు మార్చుకుంటారు. తల్లికి పెళ్ళి చేయడం కోసం వరుడిని వెతకడం మొదలు పెడతారు. ఈ క్రమంలో అప్పటికే భార్యను పోగొట్టుకున్న ఏడు కొండలు (విజయ్‌ ఆంటోనీ)ని వివాహం చేసుకోవాలని వాసవి అనుకుంటుంది. అయితే ఆమె గ్రామానికి చెందినపెద్దిరెడ్డి (బాలాజీ శక్తివేల్‌) ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు... సొంత కుటుంబ సభ్యులు సైతం ఆమె నిర్ణయాన్ని తప్పు పడతారు. వీరందరి కుట్రలను ఎదుర్కొని కొడుకలిద్దరూ కలిసి తమ తల్లి పెళ్ళి ఎలా

వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే
Asianet News Telugu19 Jun 2026
వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే

విజయ్‌ ఆంటోని తమిళ హీరోనే కాదు, టాలీవుడ్‌ హీరోగానూ పేరు తెచ్చుకుంటున్నాడు. ఆయన సినిమాలు తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలవుతుంటాయి. మంచి ఆదరణ పొందుతుంటాయి. ఇప్పుడు సరికొత్త కథాంశంతో `వంద దేవుళ్ళు` అనే

వంద దేవుళ్ళు' మూవీ రివ్యూ
Samayam Telugu19 Jun 2026
వంద దేవుళ్ళు' మూవీ రివ్యూ

విజయ్ ఆంటోనీ చిత్రాలు అంటే మినిమం గ్యారెంటీ, ఏదో ఒక కాన్సెప్ట్, కంటెంట్ ఉంటుంది.. మరీ అంత తీసిసారేసేలా అయితే ఉండదు అని ఓ నమ్మకం తెలుగు ఆడియెన్స్‌లో ఉంటుంది. అందుకే బిచ్చగాడు తరువాత ఆ రేంజ్ హిట్ లేకపోయినా ఇన్నేళ్లు కూడా సర్వైవ్ అవుతున్నారు. ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ ఆడియెన్స్‌‌ని మళ్లీ ఆ రేంజ్‌లో మెప్పించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తన మేనల్లుడు అజయ్ ధీషాన్‌ను హీరోగా నిలబెట్టాలని కూడా చూస్తున్నాడు. మరి ఈ ‘వంద దేవుళ్లు’ అనే సినిమాతో విజయ్ ఆంటోనికి, అతని మేనల్లుడు అజయ్‌కి హిట్ వచ్చిందా? లేదా? అన్నది చూద్దాం. కథ కట్టుబాట్ల పేరుతో ఆడవాళ్లని బానిసలా కట్టి పడేసే గ్రామం. అలాంటి ఊర్లో వాసవి (శ్వాసిక) ఒంటరిగా మహిళగా ఎన్నో కష్టాలు పడుతూ ఇద్దరు పిల్లల్ని భాస్కర్ (అజయ్ ధీషాన్), వివేక్ (శక్తి) పెంచి పోషిస్తుంటుంది. యవ్వనంలోనే భర్తను కోల్పోయి వితంతవులా ఊర్లో ఉండే ఆడవాళ్లని ఏ రకంగా చూస్తారు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒంటరి మహిళ అంటే అందరికీ చిన్న చూపే. ఇలాంటి ఓ సమాజంలో వాసవి ఎలా మనుగడ సాధించింది? తన పిల్లల్ని ఎలా పోషించుకుంది? ఒకానొక సమయంలో పెళ్లి చేసుకోవాలన్న వాసవి కోరికను తెలుసుకున్న యవ్వనంలో ఉన్న కుర్రాడు భాస్కర్ ఏం చేశాడు? ఆ తరువాత మనిషిలా ఎదిగి.. కాస్త ఆలోచించి.. తల్లికి పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చిన భాస్కర్ ఏం చేశాడు? మరి ఈ నిర్ణయాన్ని చిన్న కొడుకు వివేక్ ఒప్పుకుంటాడా? నలభై వచ్చాక పెళ్లి అనే ఆలోచనను వాసవి ఎలా తీసుకుంటుంది? ఆడది అంటే కట్టుబానిస అని అనుకునే ఆ ఊరు ఎలా రియాక్ట్ అయింది? ఈ కథలో ఏడు కొండలు (విజయ్ ఆంటోని) పాత్ర ఏంటి? చివరకు కథ ఎలా ముగుస్తుంది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పురుషుడు ముప్పై, నలభై, యాభై

వంద దేవుళ్ళు' మూవీ రివ్యూ.. తల్లికి రెండో పెళ్లి చేయాలనుకున్న కొడుకులు
10TV Telugu18 Jun 2026
వంద దేవుళ్ళు' మూవీ రివ్యూ.. తల్లికి రెండో పెళ్లి చేయాలనుకున్న కొడుకులు

Vanda Devullu Review : విజయ్ ఆంటోని, శ్వాసిక, అజయ్ దిశన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వంద దేవుళ్ళు’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌ బ్యానర్ పై

వ ద ద వ ళ ళ మ వ ర వ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in