
commercial LPG cylinder: ఇంటర్నెట్‌డెస్క్: వాణిజ్య, పారిశ్రామిక వినియోదారులకు కాస్త ఊరటనిచ్చే వార్త. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై రూ.183 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి, ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. దీంతో దిల్లీలో ఒక్క సిలిండర్ రూ.2,930కి లభ్యంకానుంది. ఇన్నిరోజులు ఆ ధర రూ.3,113గా ఉంది. ఇప్పటికే హోటళ్లు, రెస్టారంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాపై విధించిన ఆంక్షలను కేంద్రం తొలగించిన సంగతి తెలిసిందే. యుద్ధ సంక్షోభానికి ముందున్న స్థాయికి సరఫరాల్ని పునరుద్ధరించింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరగడం, విదేశాల నుంచి దిగుమతి స్థాయిలు మెరుగుపడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఆంక్షలను సడలించినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటన చేసింది. మరోవైపు ప్రైవేటు రంగ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ కూడా పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5, డీజిల్‌పై రూ.3 ధర తగ్గించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు