.webp)
రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్జీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్టీజీఎస్‌పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల ప్రగతిపై ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ పనులన్నీ జులై నాటికి పూర్తికావాలని మంత్రి ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలి. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలి. సంజీవని కార్యక్రమాన్ని కూడా డేటా లేక్ తో అనుసంధానించాలి. పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను డేటా లేక్ ద్వారా విశ్లేషించి, తగ్గించడానికి గల మార్గాలను అన్వేషించాలి. విద్యారంగంలో సమగ్ర సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నాం. అన్ని శాఖల సమాచారం డేటా లేక్ ద్వారా అనుసంధానం కావాలని మంత్రి సూచించారు. ప్రజల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై మరింతగా అవగాహన కలిగేలా నెలరోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు కలిగే ఉపయోగం, వినియోగం, సులభంగా ప్రభుత్వ సేవలు ఎలా పొందవచ్చో ప్రజలకు వివరించాలన్నారు. విద్యార్థులు, అభ్యర్థులకు విద్యా-క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లన్నీ అభ్యర్థి ఆధార్ నెంబర్ ఆధారంగా పారదర్శకంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థి ఆధార్ నంబర్ కొడితే ఆ విద్యార్థి లేదా అభ్యర్థికి ఆ సర్టిఫికెట్లు ఏ సంస్థ, ఎప్పుడు, ఎవరు జారీ చేశారనే వివరాలు కూడా రియల్ టైమ్‌లో తెలిసేలా డీజీ వెరిఫైని పకడ్బందీగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దీనివల్ల 99 శాతం అధికారుల పని కూడా సులభతరం అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చే వేలాది పోస్టుల నోటిఫికేషన్లకు, లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని