విజువల్స్ అరాచకం.. కథనం వీక్.. 'నాగబంధం' సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా
Actor ProfileActor

విజువల్స్ అరాచకం.. కథనం వీక్.. 'నాగబంధం' సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
మొగుడు తప్ప జీవితంలో అన్నీ ఉన్నాయి.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే - నందిని రెడ్డి
Samayam Telugu7 Sept 2026
మొగుడు తప్ప జీవితంలో అన్నీ ఉన్నాయి.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే - నందిని రెడ్డి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మానవీయ బంధాలను, సున్నితమైన భావోద్వేగాలను వెండితెరపై ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఆవిష్కరించడంతో మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దిట్ట. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా

విజువల్స్ అరాచకం.. కథనం వీక్.. 'నాగబంధం' సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా
Samayam Telugu6 Sept 2026
విజువల్స్ అరాచకం.. కథనం వీక్.. 'నాగబంధం' సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా

టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో మైథాలజీ, సోషియో ఫాంటసీ జోనర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే బాటలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది తాజా చిత్రం ‘ నాగబంధం : ది సీక్రెట్ ట్రెజర్’. యువ నటుడు విరాట్ కర్ణ , గ్లామరస్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటించిన ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంపై టీజర్, ట్రైలర్ల నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ పతాకాలపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా దర్శకుడిగా మారి ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించారు. ఐశ్వర్యా మీనన్, దక్ష నగర్కర్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, రిషభ్ సాహ్నీ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మన పురాతన విష్ణు ఆలయాలు, వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలు, సనాతన ధర్మం మరియు చారిత్రక అంశాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన నేపథ్యంలో, సోషల్ మీడియాలో (ట్విట్టర్) ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో వివరంగా చూద్దాం.* సత్యదేవ్ 'రావు బహదూర్' ట్విట్టర్ రివ్యూ: సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?ట్విట్టర్ టాక్'నాగబంధం' సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు (మిక్స్డ్ టాక్) వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన విజువల్ వండర్ అని, భారీ గ్రాండియర్ తో థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇస్తుందని కొనియాడుతుండగా.. మరో వర్గం వారు మాత్రం కేవలం హంగుల కోసమే సినిమా తీసినట్లు ఉందని, బరువైన కథాంశం లోపించిందని పెదవి విరుస్తున్నారు. ఓవరాల్‌గా ట్విట్టర్‌లో ఈ సినిమాకు 1.75 నుంచి 3 వరకు రేటింగ్స్ కనిపిస్తున్నాయి