వైజాగ్ లో లెనిన్’ గర్జన... ట్రైలర్ రిలీజ్ డేట్
Actor ProfileActor

వైజాగ్ లో లెనిన్’ గర్జన... ట్రైలర్ రిలీజ్ డేట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వైజాగ్ లో లెనిన్’ గర్జన... ట్రైలర్ రిలీజ్ డేట్, ప్లేస్ అనౌన్స్ చేసిన అఖిల్
Samayam Telugu14 Aug 2026
వైజాగ్ లో లెనిన్’ గర్జన... ట్రైలర్ రిలీజ్ డేట్, ప్లేస్ అనౌన్స్ చేసిన అఖిల్

అక్కినేని నట వారసుడిగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్లో ఇప్పటివరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. సాలిడ్ సక్సెస్ అందుకోవాలనే పట్టుదలతో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సారి ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టి స్టార్ హీరో స్టేటస్‌ను సొంతం చేసుకోవాలని పక్కా మాస్ యాక్షన్ ప్లాన్‌తో ‘లెనిన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.* ఓటీటీలో ‘బ్లాస్ట్’ అవుతున్న ప్రీతి ముకుందన్ క్రేజ్.. నీల యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు నెటిజన్లు ఫిదా! ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో మెప్పించిన మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో, గ్రామీణ నేపథ్యంలోని పక్కా మాస్ ఎలిమెంట్స్, హృదయానికి హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచుతూ, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అదిరిపోయే రేంజ్‌లో అనౌన్స్ చేసింది. వైజాగ్‌లో ట్రైలర్ బ్లాస్ట్విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లను వినూత్నంగా ప్లాన్ చేసింది. అందులో భాగంగా ‘లెనిన్’ అఫీషియల్ ట్రైలర్‌ను విశాఖపట్నంలోని శరత్ థియేటర్ వేదికగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఘనంగా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. రేపు వైజాగ్‌లో కలుద్దాం... మీ అందరితో కలిసి ‘లెనిన్’ ట్రైలర్ చూడటానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. మీ ప్రేమాభిమానాలు, రియాక్షన్స్ కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. ట్రైలర్ లాంచ్ అప్‌డేట్‌తో విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. రగ్డ్‌ మాస్ లుక్‌లో అఖిల్ సైకిల్‌పై దూసుకొస్తున్న ఈ పోస్టర్ సినిమాలోని హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు