విజయ్ సహా మంత్రుల భవిష్యత్తు తేల్చనున్న మద్రాస్ హైకోర్టు
Actor ProfilePolitician

విజయ్ సహా మంత్రుల భవిష్యత్తు తేల్చనున్న మద్రాస్ హైకోర్టు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విజయ్ సహా మంత్రుల భవిష్యత్తు తేల్చనున్న మద్రాస్ హైకోర్టు
Oneindia Telugu27 Jul 2026
విజయ్ సహా మంత్రుల భవిష్యత్తు తేల్చనున్న మద్రాస్ హైకోర్టు

ఈ ఏడాది తమిళనాడు (tamil nadu)లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓ సంచలనం. ఇందులో దశబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న, ఎన్నోసార్లు ప్రభుత్వాలు నడిపిన అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్ని కాదని ప్రజలు విజయ్ కొత్త పార్టీ టీవీకేకు అనుకూలంగా ఓటేశారు. దీంతో టీవీకేకు మెజార్టీ రాకపోయినా మెజార్టీ ప్రజల మొగ్గు విజయ్ వైపే ఉందని తేలిపోయింది. దీంతో చిన్నా చితకా పార్టీల్ని కలుపుకుని విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు మొదలయ్యాయి.Tamil Nadu: తమిళ ఎన్నికల్లో విదేశీయుల ఓట్లు ? రంగంలోకి ఈసీ, ఐబీ-ఎస్ఐఆర్ పైనా..!తమిళనాడులో విజయ్ సహా పలువురు విజేతల ఫలితాలను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో అసాధారణంగా భారీ సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. జూన్ 18న గడువు తేదీ లోపు హైకోర్టు రిజిస్ట్రీలో తమిళనాడు ఎన్నికల ఫలితాలపై సుమారు 55 ఎన్నికల పిటిషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, మద్రాస్ హైకోర్టు నిబంధనలు 1967 ప్రకారం ఎన్నికల పిటిషన్లకు నంబర్ కేటాయించే ముందు వాటిపై కఠినమైన పరిశీలన చేస్తారు. ఫలితాలు వెలువడిన 45 రోజులలోపు పిటిషనర్లు ఈ కేసులను స్వయంగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు లేదా తమ నియోజకవర్గంలోని ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ ఏదైనా ఒక ఓటరు కూడా ఈ పిటిషన్లను దాఖలు చేయవచ్చు. అలా ఈసారి విజయ్ పోటీ చేసిన పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఓటర్లు ఆయన విజయాన్ని సవాలు చేస్తూ ఎన్నికల పిటిషన్లను దాఖలు చేశారు. స్టాలిన్ ను అసెంబ్లీకి రప్పించబోతున్న విజయ్ ? ఆ ఒక్క డైలాగ్ తో మారిన సీన్..!అలాగే చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుండి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విజయాన్ని, అలాగే విల్లివాక్కం, గోబిచెట్టిపాళయం, డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ నియోజకవర్గాల నుండి వరుసగా మంత్రులు ఆధవ్ అర్జున, కె.ఎ.సెంగోట్టయన్ , ఎన్. మేరీ విల్సన్