విజయ్ మీసం తిప్పిన రష్మిక.. స్కాలర్ షిప్ ఈవెంట్ లో వైరల్ వీడియో
Actor ProfileCelebrity

విజయ్ మీసం తిప్పిన రష్మిక.. స్కాలర్ షిప్ ఈవెంట్ లో వైరల్ వీడియో

Total News1
Movie Updates0
Sources1
విజయ్ మీసం తిప్పిన రష్మిక.. స్కాలర్ షిప్ ఈవెంట్ లో వైరల్ వీడియో
Zee Telugu14 Jun 2026
విజయ్ మీసం తిప్పిన రష్మిక.. స్కాలర్ షిప్ ఈవెంట్ లో వైరల్ వీడియో

Rashmika Mandanna:విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందానా చేసిన చిన్న చిన్న హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందానా ఇటీవల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇద్దరి మధ్య జరిగిన కొన్ని సరదా క్షణాలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమం నాగర్‌కర్నూల్ జిల్లాలోని తుమ్మన్‌పేట ప్రాంతంలో నిర్వహించారు. ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు విజయ్ తెలిపారు. అయితే స్కాలర్‌షిప్‌ల పంపిణీ కంటే కూడా ఈ కార్యక్రమంలో విజయ్, రష్మిక మధ్య జరిగిన చిన్న చిన్న సంఘటనలు సోషల్ మీడియాలో ఎక్కువ చర్చకు దారితీశాయి. వేదికపై ఉన్న సమయంలో విజయ్‌కు రష్మిక కర్చీఫ్ ఇవ్వడం, ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. అలాగే విజయ్ తన మీసాన్ని తిప్పుకుంటుండగా, రష్మిక వెళ్లి అతని మీసాన్ని తిప్పిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వీడియో చూపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు సహాయం చేయాలనే వారి నిర్ణయంపై కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చదువులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు అండగా నిలవడం మంచి విషయమని పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన 180 మంది విద్యార్థుల ఉన్నత విద్యకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని విజయ్ దేవరకొండ వెల్లడించారు. రష్మిక కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు

వ జయ మ స త ప ప న రష మ క స క లర ష ప ఈవ ట ల వ రల వ డ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in