విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
Actor ProfilePolitician

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
Andhra Jyothy30 Aug 2026
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

తమిళనాడులోని విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్‌ చేసిన ఆరోపణపై ఒక యూట్యూబర్‌ సహా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ మారాలని... ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్‌.. టీవీకే ఎమ్మెల్యేతో యూట్యూబర్‌ బేరసారాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదుగురి అరెస్టు నిందితులు డీఎంకే మాజీ మంత్రి సెంథిల్‌బాలాజీ అనుచరులు చెన్నై, జూలై 1(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్‌ చేసిన ఆరోపణపై ఒక యూట్యూబర్‌ సహా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ మారాలని ఒత్తిడి చేస్తూ తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీకి చెందిన పదిమంది శాసనసభ్యులకు తలా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు బేరసారాలు జరిపారన్నది ఆరోపణ. అరెస్టయిన ఐదుగురు వ్యక్తులు డీఎంకేకు చెందిన మాజీమంత్రి సెంథిల్‌బాలాజీ అనుచరులు. కృష్ణగిరి జిల్లా ఊత్తాంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే ఎన్‌.ఇళయరాజాకు ఇటీవల ఓ యూట్యూబర్‌ ఫోన్‌ చేసి ఈ బేరసారాలు జరపటంతో ఆయన గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ అమల్‌రాజ్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలంటూ ట్రిప్లికేన్‌ పోలీసులను కమిషనర్‌ ఆదేశించారు. దీనిపై ప్రత్యేక దళం పోలీసులు లోతైన విచారణ జరిపి చెన్నై ఆరుంబాక్కం ప్రాంతానికి చెందిన యూట్యూబర్‌ తిరునావుక్కరసును అరెస్టు చేశారు. దర్యాప్తులో అతడు వెల్లడించిన వివరాల ఆధారంగా తిరుచ్చికి చెందిన నరేష్‌, చెన్నైకి చెందిన త్యాగరాజన్‌లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి సెంథిల్‌బాలాజీ, ఆయన సోదరుడు అశోక్‌కుమార్‌, వీరి అనుచరులకు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో కనుగొన్నారు. ఆ మేరకు కరూర్‌లో ఉన్న సెంథిల్‌బాలాజీ అనుచరుడు, ప్రముఖ ఫైనాన్స్‌ సంస్థ అధినేత రమేష్‌, శక్తిమెస్‌ నిర్వాహకుడు కార్తీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరినీ బుధవారం చెన్నైకి తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఇక తిరునావుక్కరసు, నరేష్‌, త్యాగరాజన్‌లను పోలీసులు ఎగ్మూరు

వ జయ ప రభ త వ న న క ల చ క ట ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in