విజయ్ దేవరకొండకు షాక్.. టీజీ20 క్రికెట్ లీగ్
Actor ProfileActor

విజయ్ దేవరకొండకు షాక్.. టీజీ20 క్రికెట్ లీగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విజయ్ దేవరకొండకు షాక్.. టీజీ20 క్రికెట్ లీగ్ పై లీగల్ నోటీసుల కలకలం
SkyC Media17 Jun 2026
విజయ్ దేవరకొండకు షాక్.. టీజీ20 క్రికెట్ లీగ్ పై లీగల్ నోటీసుల కలకలం

తెలంగాణ క్రికెట్ వర్గాలలో సరికొత్త వివాదం భగ్గుమంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగాల్సిన టీజీ20 లీగ్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఈ లీగ్‌కు ఎలాంటి అధికారిక అనుమతులు లేవని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో లీగ్‌ను ప్రమోట్ చేస్తున్న యువ నటుడు విజయ్ దేవరకొండతో పాటు పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లకు టీసీఏ లీగల్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ సీజన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా టీజీ20 లీగ్‌ను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు, సుమారు 160 మంది ఆటగాళ్లు పాల్గొంటారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. జూన్ 21 నుంచి జూలై 10 వరకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికి స్రీనిధి యూనివర్శిటీ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా, విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌కు నుంచి ఎలాంటి అనుమతులు లేవని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువా రెడ్డి ఆరోపిస్తున్నారు. బీసీసీఐ నిబంధనలలోని రూల్ 31 ను హెచ్‌సీఏ పూర్తిగా ఉల్లంఘించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ లీగ్ వెనుక భారీగా రాజకీయ, రియల్ ఎస్టేట్ ఆర్థిక లాభాలు ఉన్నాయంటూ ఆయన తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఫలితంగా విజయ్ దేవరకొండ, వెంకటేశ్, తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహమ్మద్ సిరాజ్ వంటి ప్రముఖులకు నోటీసులు పంపుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు హెచ్‌సీఏ మాత్రం ఈ లీగ్‌కు బీసీసీఐ నుంచి పూర్తి ఆమోదం లభించిందని గట్టిగా చెప్తోంది. మే 6, 2026 నాడే బీసీసీఐ ఆమోద లేఖ లభించిందని, ఆ వివరాలను లీగ్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని స్పష్టం చేసింది. తెలంగాణ గ్రాస్‌రూట్స్ క్రికెట్‌ను మరియు యువ ఆటగాళ్లను ప్రోత్సహించే లక్ష్యంతోనే దీనిని ముందుకు తీసుకెళ్తున్నామని హెచ్‌సీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రెండు ప్రధాన క్రికెట్ సంస్థల మధ్య ఉన్న