వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది
Actor ProfileActor

వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఫ్రాన్స్ లో రాజమౌళి చరిత్ర
Chitrajyothy3 Sept 2026
ఫ్రాన్స్ లో రాజమౌళి చరిత్ర

దర్శక ధీరుడిని మరోసారి ప్రపంచం మెచ్చింది. దిగ్గజ మూవీ మేకర్లకు లభించే గౌరవం దక్కింది. ఇండియన్ సినిమా గర్వంగా ఫీల్ అయ్యేలా రాజమౌళిని అంతర్జాతీయ వేదిక గుర్తించింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి

వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది
Chitrajyothy29 Aug 2026
వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది

టాలీవుడ్‌లో కొన్ని టాప్ బ్యానర్స్ ఉన్నాయి. వాటిలో వైజయంతీ మూవీస్ ఒకటి. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ సంస్థ‌కు సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. టాలీవుడ్‌లో కొన్ని టాప్ బ్యానర్స్ ఉన్నాయి. వాటిలో వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) ఒకటి. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ సంస్థ‌కు సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. వైవిధ్యభరితమైన చిత్రాలతో అప్పుడెలా అయితే పేరుని తెచ్చుకుందో.. ఇప్పుడు కూడా ఆ పేరును నిలబెట్టుకోవడమే కాదు.. ఒక బ్రాండ్‌గా పిలుచుకునేలా ఈ సంస్థ మారిందంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ విషయాలను పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో ఈ సంస్థ నుంచి వస్తోన్న చిత్రాలు ఎంతో వైవిధ్యతతో ఉండటం విశేషం. రొటీన్, రొట్ట సినిమాలు కాకుండా.. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనాన్ని పరిచయం చేస్తూ.. ఈ సంస్థ దూసుకెళుతోంది. కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందుకు కారణం యంగ్ జనరేషనే. ఒకే టైపు సినిమాలకు స్వస్తి పలుకుతూ.. సినిమాసినిమాకు వైవిధ్యతను కనబరుస్తూ.. క్రియేటివ్ ఫ్రీడమ్‌ గొప్పతనమేంటో ఈ సంస్థ తెలియజేస్తోంది. ఈ విషయంలో ఎన్నో సంస్థలకు ఈ సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మార్పు నాగ్ అశ్విన్‌తోనే మొదలైంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా ఇప్పుడు ఎంతో మందికి ఫేవరేట్ సినిమాగా ఉందంటే.. అందులో ఉన్న కంటెంట్‌తో పాటు క్రియేటివ్ ఫ్రీడమ్‌కు ఈ సంస్థ ఇచ్చిన ఇంపార్టెన్సే అని చెప్పుకోవాలి. అప్పటి నుంచి వరసగా.. ‘మహానటి’, ‘జాతిరత్నాలు’, ‘సీతా రామం’, ‘కల్కి 2898 AD’.. ఇంకా రీసెంట్‌గా వచ్చిన ‘సింగ్ గీతం’. ఈ సినిమాలను గమనిస్తే.. వేటికవే ప్రత్యేకతను చాటుకున్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర నిలబడిన చిత్రాలే. ఇవి కాకుండా ‘ఛాంపియన్’ వంటి మరో సంచలన చిత్రం కూడా ఈ బ్యానర్ నుంచే వచ్చింది. ఈ

వ జయ త మ వ స బ య నర ర ట వ ర బ ర డ అ ట ఇద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in