
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. విజయ్ ఫ్యాక్టర్‌తో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా.. ప్రతిపక్ష డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌లో చీలికలు కనిపిస్తున్నాయి. ఆఖరికి స్టాలిన్‌తో ఎనిమిదేళ్లకు పైగా కలిసి నడిచిన ఎండీఎంకే కూడా కూటమికి గుడ్‌బై చెప్పింది. పైగా రాజకీయ ప్రత్యర్థిని ఆకాశానికెత్తడంతోనే ఆగిపోకుండా.. సంచలన ఆరోపణలు చేస్తూ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఇదంతా స్టాలిన్‌కు బిగ్ షాక్ అని అంతా భావించారు. కానీ.. ఇక్కడే తమిళ రాజకీయాల్లో ఎవరూ ఊహించనిది జరిగింది. పొలిటికల్ గేమ్‌లో పావులు తారుమారు అయ్యాయి. డీఎంకేకు షాక్ ఇవ్వాలనుకున్న వైకోకే.. 24 గంటలు గడవక ముందే పెద్ద షాక్ తగిలింది. ఆయన పార్టీకి చెందిన 150 మందికిపైగా కీలక నేతలు డీఎంకే కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం ఎండీఎంకే అధినేతను రాజకీయంగా ఇరకాటంలో పడేసినట్లయ్యింది. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం 'అన్నా అరివాలయం'లో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి. శివగంగా, తిరువల్లూర్, విరుధునగర్, తిరుపూర్ జిల్లాలకు చెందిన రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, న్యాయవాదులు, విద్యార్థి విభాగ నేతలు డీఎంకే కండువా కప్పుకున్నారు. తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీకి చెందిన సుమారు 40 మంది విద్యార్థులు కూడా డీఎంకేలో చేరడం విశేషం. 1994లో డీఎంకేతో విభేదాల కారణంగా వైకో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే)ను స్థాపించారు. ఆ తర్వాత అనేక రాజకీయ ఒడిదొడుకుల మధ్య గత ఎనిమిదేళ్లుగా.. డీఎంకే నేతృత్వంలోని కూటమిలోనే కొనసాగారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎస్పీఏ కూటమి నుంచే పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించగా.. అందులో మూడు స్థానాల్లో డీఎంకే ఎన్నికల గుర్తు ఉదయించే సూర్యుడు గుర్తుపై అభ్యర్థులను బరిలోకి దించడం గమనార్హం. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో వైకో.. తమిళగ వెట్రి కళగం (టీవీకే)