విజయ్ .. ఆ రోజు మాటిచ్చారు.. ఈ రోజు నిలబెట్టుకున్నారు
Actor ProfilePolitician

విజయ్ .. ఆ రోజు మాటిచ్చారు.. ఈ రోజు నిలబెట్టుకున్నారు

Total News1
Movie Updates0
Sources1
విజయ్ .. ఆ రోజు మాటిచ్చారు.. ఈ రోజు నిలబెట్టుకున్నారు
Chitrajyothy14 Jun 2026
విజయ్ .. ఆ రోజు మాటిచ్చారు.. ఈ రోజు నిలబెట్టుకున్నారు

అచ్చంపేట డివిజన్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తానని పెళ్లి సమయంలో విజయ్‌ దేవరకొండ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే! ఆ మాటను ఆదివారం నెరవేర్చారు. ‘నేను, రష్మిక స్కూల్‌, కాలేజీల్లో ఫస్ట్‌, సెకండ్‌ ర్యాంక్‌ తెచ్చుకున్న వాళ్లం కాదు. విద్యార్థుల నుంచి నేను కోరుకునేది మార్కులు, ఫస్ట్‌, సెకండ్‌ ర్యాంకులు. కాదు. కష్టపడితే అవి ఎలాగూ వస్తాయి. క్రమశిక్షణ, చేసే పని మీద ఫోకస్‌ పెట్టాలని కోరుకుంటున్నా. అది ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. అచ్చంపేట డివిజన్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తానని పెళ్లి సమయంలో ఆయన మాట ఇచ్చిన సంగతి తెలిసిందే! ఆ మాటను ఆదివారం నెరవేర్చారు. ‘ది దేవరకొండ ఫౌండేషన్‌’ ద్వారా ఈ ఏడాది అచ్చంపేట డివిజన్‌లోని విద్యార్థుల ‘మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అవార్డీస్‌’ జాబితాను విడుదల చేశారు. ఇందులో మొత్తం 45 ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది 9, 10వ తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఈ ఉపకారవేతనాలు అందజేశారు. తుమ్మన్‌పేట జడ్పీహెచ్‌ఎస్‌ నుంచి 9వ తరగతిలో బి. హేమలత (1వ ర్యాంక్‌), పి. ప్రణీత (2వ ర్యాంక్‌) ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్‌ (ఫస్ట్‌ ర్యాంక్‌), బి. అనిల్‌ (సెకండ్‌ ర్యాంక్‌) ఈ స్కాలర్‌ షిప్‌ సాధించారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయం దేవరకొండ ఇచ్చిన మాట మేరకు స్కాలర్‌షిప్స్‌ అందజేశారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘బాగా చదువుతున్న పిల్లల్ని ప్రోత్సహించాలి. వారికి మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. నేనీ స్థాయిలో ఉన్నానంటే నా తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ, పుట్టపర్తిలో నేను చదివిన స్కూల్‌, నా నడవడిక కారణం’ అని అన్నారు

వ జయ ఆ ర జ మ ట చ చ ర ఈ ర జ న లబ ట ట క న న ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in