
ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలు, పర్యటనలు, రాజకీయ సమావేశాలతో బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి సోషల్ మీడియాలో సరదా వీడియోను పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన అధికారిక 'ఎక్స్' ఖాతాలో షేర్ చేసిన ఓ ఏఐ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. "ఈ వీడియో చూసిన తర్వాత నవ్వకుండా ఉండలేకపోతున్నా" అంటూ ఆయన చేసిన వ్యాఖ్య కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ కుర్చీలో కూర్చుని కనిపిస్తుంది. ఆమె ముందు "ఆర్నా IAS – విశాఖపట్నం" అనే నేమ్‌ప్లేట్, జాతీయ జెండా, ల్యాప్‌టాప్ ఏర్పాటు చేసి నిజమైన కార్యాలయ వాతావరణాన్ని సృష్టించారు. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై సీఎం చంద్రబాబు వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లు ఏఐ సాయంతో రూపొందించారు. ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరో వెంకటేష్ చెప్పిన ప్రసిద్ధ కామెడీ డైలాగ్. చిన్నారి తన తండ్రి కిటికీలో కనిపించగానే, "బై సీబీఎన్ అంకుల్... నేనిప్పుడు మీతో మాట్లాడలేను... టీవీ కట్టేసి, నన్ను క్షమించు నాన్నా... నిన్ను వెయిట్ చేయించానని ఆయన కాళ్ల మీద పడ్డా" అనే సినిమా డైలాగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించేలా వీడియోను రూపొందించారు. ఈ డైలాగ్‌కు తగ్గట్టుగా చిన్నారి చేసిన హావభావాలు వీడియోకు మరింత వినోదాన్ని జోడించాయి. వీడియోలో చిన్నారి ఎంతో అమాయకంగా సీఎం చంద్రబాబుకు చేతి ఊపుతూ వీడ్కోలు చెప్పడం, అదే సమయంలో ఆమె తండ్రి ప్రేమగా కూతురిని చూస్తూ నిలబడటం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఏఐ టెక్నాలజీని వినోదాత్మకంగా ఉపయోగించి రూపొందించిన ఈ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్న వెంటనే అది వేగంగా వైరల్ అయింది. సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులు చేసే సీఎం, ఈసారి సరదా వీడియోను