విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చామ్ సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఓ కామెడీ సీన్‌లో వెంకీ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. 'నేను ఐఏఎస్ పాసయ్యాక వైజాగ్ కలెక్టరేట్‌లో కలెక్టర్ చైర్‌లో కూర్చుని చంద్రబాబు నాయుడు గారితో కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు.. ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను.. చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి.. వెంటనే టీవీ కట్టేసి.. నన్ను క్షమించు నాన్న.. నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్లపై పడతాను' అంటూ వెంకటేష్ చెప్పే సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు అదే సీన్‌ను రీ క్రియేట్ చేసి సరదాగా ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియో ఫన్నీగా ఉందంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇదే డైలాగ్‌తో ఆర్నా అనే పాపతో ఆమె తండ్రి ఫన్నీగా ఓ వీడియో ఏఐ ద్వారా రూపొందించారు. ఈ వీడియోలో ఆర్నా పాప ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్లుగా నువ్వు నాకు నచ్చావ్ మూమీలో సీన్‌ను రీ క్రియేట్ చేశారు. ఆర్నా పాప వీడియో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. 'ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండటం అసాధ్యం.. నేను అఫిషియల్‌గా ఆర్నాకు మద్దతు ఇస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబుకు ఈ వీడియో బాగా నచ్చింది అందుకే ఎక్స్ (ట్విట్టర్‌లో) అందరితో పంచుకున్నారు. ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. చంద్రబాబు ఆయనపై వచ్చిన మీమ్‌ను పోస్ట్ చేయడం బావుందని ఓ నెటిజన్ అన్నారు. మరో నెటిజన్ ఇదే డైలాగ్‌తో తన కుమారుడి వెర్షన్‌లో చేసిన మరో వీడియోను షేర్ చేశారు.చంద్రబాబు ట్వీట్ చేసిన వీడియోలో చిన్నారి ఆర్నా ముందు 'ఆర్నా ఐఏఎస్ – విశాఖపట్నం' పేరుతో నేమ్ ప్లేట్ ఉంది. పాప వెనుక స్క్రీన్‌పై చంద్రబాబుతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లుగా క్రియేట్ చేశారు
Actor ProfilePolitician
వెంకటేష్ మూవీ డైలాగ్ తో మీమ్.. ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరన్న సీఎం చంద్రబాబు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•25 Jul 2026
వెంకటేష్ మూవీ డైలాగ్ తో మీమ్.. ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరన్న సీఎం చంద్రబాబు