వచ్చే నెలలోనే ఐఆర్ సీటీసీ కొత్త వెబ్ సైట్.. వారెవ్వా.. ఈ ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే
Actor ProfilePolitician

వచ్చే నెలలోనే ఐఆర్ సీటీసీ కొత్త వెబ్ సైట్.. వారెవ్వా.. ఈ ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే

Total News1
Movie Updates0
Sources1
వచ్చే నెలలోనే ఐఆర్ సీటీసీ కొత్త వెబ్ సైట్.. వారెవ్వా.. ఈ ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే
TV9 Telugu15 Jun 2026
వచ్చే నెలలోనే ఐఆర్ సీటీసీ కొత్త వెబ్ సైట్.. వారెవ్వా.. ఈ ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై ట్రైన్ టికెట్లను అత్యంత వేగంగా బుక్ చేసుకోవచ్చు. సర్వర్ సమస్యలు, సైట్ నెమ్మదించడం లాంటి సమస్యలు ఉండవ్. బుకింగ్ ప్రాసెస్ వేగవంతం కానుంది. ఎందుకంటే.. వచ్చే నెల నుంచి ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్ సైట్ వచ్చేస్తోంది. జులై 15వ తేదీలోగా కొత్త వెబ్ సైట్ తీసుకురానున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. అసలు ఈ కొత్త వెబ్ సైట్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ప్రస్తుతం ఉన్న ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో క్యాప్చాలు ఎంటర్ చేయడం, ఒకేసారి అందరూ ఓపెన్ చేస్తే క్రాష్ అవ్వడం, తత్కాల్ బుకింగ్ సమయంలో నెమ్మదించడం లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ కొత్త వెబ్ సైట్లో అలాంటి సమ్యలు ఉండవు. వెబ్ సైట్‌కు అధిక ట్రాఫిక్ ఉన్నా మెరుగ్గా పనిచేస్తుంది. ఇక తత్కాల్ బుకింగ్ సమయంలో కూడా వేగవంతంగా పనిచేస్తుంది. ఇక సీటు ఎంపిక ఫీచర్ కూడా ఇందులో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా యూజర్ ఇంటర్ ఫేస్, నావిగేషన్ మరింత సులభంగా ఉండేలా రూపొందించారు. పీక్ బుకింగ్ సమయంలో ఇప్పటివరకు క్రాష్ అవ్వడం, ఆలస్య కావడం, ఇతర టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. కొత్త సైట్లో ఇలాంటి సమస్యలు ఉండవని రైల్వేశాఖ చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైన్లలో ప్రయాణించేవారిలో 88 శాతం మంది ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. కానీ ప్రయాణికుల సామర్థ్యానికి అనుగుణంగా ఫ్లాట్ ఫామ్ వేగాన్ని మెరుగుపర్చడంలో భాగంగా కొత్త రిజర్వేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్‌లో అనేక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నాయి. టికెట్లను బుక్ చేసుకోలేకపోతున్నారు. దీనిపై పదే పదే ప్రయాణికుల నుంచి రైల్వేశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కొత్త ఫ్లాట్ ఫామ్ తీసుకొస్తున్నారు. ఇక లాగిన్ సమయంలో, పేమెంట్స్ చేసే సమయంలో ఓటీపీ ఆలస్యాలు కూడా జరుగుతున్నాయి. దీని వల్ల వెంటనే టికెట్లను పొందలేకపోతున్నారు. కొత్త వెబ్ సైట్లో ఈ ప్రాసెస్‌లు కూడా వేగంగా