
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో పర్యటించి, ప్రతిష్ఠాత్మకమైన 'జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్నారు. కర్నూలు జిల్లా, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో పర్యటించి, ప్రతిష్ఠాత్మకమైన 'జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జిల్లాలో పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించడంలో అత్యంత కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఈ మైనింగ్ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు, స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏపీలో పారిశ్రామికవృద్ధికి, మైనింగ్ రంగానికి ఈ ప్రాజెక్ట్ ఒక కొత్త దిక్సూచిగా మారి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడనుంది. లైవ్ వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.. విశాఖ అగ్నిప్రమాదం.. కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం