లైవ్ లో ప్రభాస్ కు ఫోన్ చేసిన కేటీఆర్
Actor ProfileCelebrity

లైవ్ లో ప్రభాస్ కు ఫోన్ చేసిన కేటీఆర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లైవ్ లో ప్రభాస్ కు ఫోన్ చేసిన కేటీఆర్
AP7AM27 Aug 2026
లైవ్ లో ప్రభాస్ కు ఫోన్ చేసిన కేటీఆర్

రాజకీయ కార్యక్రమాలు, పదునైన విమర్శలతో ఎప్పుడూ బిజీగా ఉండే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఎవరూ ఊహించని విధంగా సరికొత్త ఎంటర్‌టైనింగ్ లుక్‌లో మెరిసి అందరినీ ఫిదా చేశారు. ‘ది అండర్ 18 వరల్డ్’ అనే చిన్నారుల గ్రూప్‌తో ఆయన సరదాగా ముచ్చటించిన ఓ ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఈ చిట్‌చాట్‌లో పిల్లలు అడిగిన కొన్ని గూగ్లీ లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేటీఆర్ సరదాగా తల పట్టుకోవడం అందరినీ నవ్విస్తోంది. అయితే, ఈ షోలోనే అసలైన ట్విస్ట్ ఇస్తూ.. టాక్ షో జరుగుతుండగానే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఆయన లైవ్‌లోనే ఫోన్ కాల్ చేశారు. కేటీఆర్ ప్రభాస్‌తో మాట్లాడటం చూసి అక్కడ ఉన్న పిల్లలతో పాటు ఆడియన్స్ సైతం ఆనందంలో మునిగిపోయారు. మరోవైపు, షోలో పాల్గొన్న ఒక చిన్నారి ఛాలెంజ్ విసరడమే ఆలస్యం.. కేటీఆర్ ఏమాత్రం తగ్గకుండా స్టేజ్ పైనే ఆమెతో పోటీ పడి మరీ పుష్-అప్స్ తీసి తన ఫిట్‌నెస్‌తో ఆశ్చర్యపరిచారు. సరిగ్గా ఇంటర్వ్యూ రసవత్తరంగా సాగుతున్న సమయంలోనే ఆయన భార్య శైలిమ నుంచి ఫోన్ రావడం... కేటీఆర్ ఒక్కసారిగా కంగారు పడుతూ.. 'షోలో ఉన్నాను, తర్వాత చేస్తా' అంటూ స్పీడ్‌గా ఫోన్ కట్ చేయడం ఈ ప్రోమోకే అసలైన హైలైట్‌గా నిలిచింది. ఎంతటి పవర్‌ఫుల్ లీడరైనా భార్య ఫోన్ వస్తే ఆ ఆందోళన కామనే కదా? అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. లీడర్‌లోని సరికొత్త వినోదాత్మక కోణాన్ని చూపించిన ఈ ఫుల్ ఇంటర్వ్యూ వీడియో త్వరలోనే రిలీజ్ కానుండటంతో ఇప్పుడు దీని గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది

ల వ ల ప రభ స క ఫ న చ స న క ట ఆర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in