
రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న ‘కాంచన 4’లో కీలక పాత్ర కోసం మొదట రష్మిక మందన్న పేరు వినిపించగా, ఇప్పుడు నయనతారను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండస్ట్రీలో హారర్-కామెడీ జానర్‌కు సరికొత్త అర్థాన్ని ఇచ్చి, తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ కాంచన (Kanchana). ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) సృష్టించిన ఈ సిరీస్ తమిళంతో పాటు తెలుగులోనూ వసూళ్ల సునామీ సృష్టించింది. గతంలో విడుదలైన 'ముని', 'కాంచన', 'గంగ', 'కాంచన 3' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్బస్టర్లుగా నిలిచి, ఈ సిరీస్‌కు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతున్న కాంచన 4 (Kanchana 4 )పై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలోని పాత్రల ఎంపికకు సంబంధించిన కాస్టింగ్ వార్తలు సాషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఆఖరి భాగాన్ని మునుపటి చిత్రాల కంటే అత్యంత గ్రాండ్‌గా, ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దేందుకు రాఘవ లారెన్స్ పక్కా స్కెచ్ వేస్తున్నారట. ఇందులో భాగంగానే భారీ తారాగణాన్ని రంగంలోకి దించారట. ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde), బాలీవుడ్ గ్లామర్ డాల్ నోరా ఫతేహి (Nora Fatehi) ప్రధాన పాత్రల్లో నటిస్తూ గ్లామర్ హంగులు జోడిస్తున్నారు. వీరితో పాటు 'కాంచన' ఫ్రాంచైజీకి వెన్నెముక లాంటి కామెడీ ట్రాక్ కోసం కోవై సరళ, దేవదర్శినిలతో పాటు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కామెడీ నటుడు రెడిన్ కింగ్స్లే కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. దీంతో ఈసారి భయంతో పాటు వినోదం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని స్పష్టమవుతోంది. అయితే, ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఒక అత్యంత కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పాత్ర కోసం ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)