లో కాజల్ ఎంట్రీ.. బర్త్ డే రోజే బిగ్ సర్ ప్రైజ్
Actor ProfileActor

లో కాజల్ ఎంట్రీ.. బర్త్ డే రోజే బిగ్ సర్ ప్రైజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లో కాజల్ ఎంట్రీ.. బర్త్ డే రోజే బిగ్ సర్ ప్రైజ్
Zee Telugu19 Jun 2026
లో కాజల్ ఎంట్రీ.. బర్త్ డే రోజే బిగ్ సర్ ప్రైజ్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Kajal Aggarwal:ఈ రోజు విడుదలైన NBK111 పోస్టర్‌లో కాజల్ చాలా సింపుల్‌గా కనిపించినా, ఆమె లుక్‌లో ఓ ప్రత్యేకమైన గంభీరత కనిపిస్తోంది. చీర కట్టుకుని, కళ్లజోడు ధరించి, ఒక కార్యాలయ వాతావరణంలో నిలబడి ఉన్నట్లు పోస్టర్‌లో చూపించారు. ఆమె ముఖంలోని సీరియస్ ఎక్స్‌ప్రెషన్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌తో పాటు చిత్ర బృందం కాజల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్, ఎమోషన్‌ల కలయికగా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.కాజల్ ఈ సినిమాలో నటిస్తోందనే వార్తలు చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు పుట్టినరోజు పోస్టర్ విడుదల చేయడంతో కాజల్ ఎంట్రీని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇది బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్‌లో రెండో సినిమా కానుంది. గతంలో వీరిద్దరూ ‘భగవంత్ కేసరి’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమాలో కాజల్ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఈసారి NBK 111లో ఆమె పూర్తి స్థాయి కథానాయికగా కనిపించనుందని తెలుస్తోంది. కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాజల్ అగర్వాల్ దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరు. మగధీర, డార్లింగ్, బృందావనం, ఆర్య 2 వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి