లఖ్ నవూ అగ్నిప్రమాదం
Actor ProfilePolitician

లఖ్ నవూ అగ్నిప్రమాదం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
లఖ్ నవూ అగ్నిప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న బాధిత కుటుంబాల ఆవేదన
Andhra Jyothy4 Jul 2026
లఖ్ నవూ అగ్నిప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న బాధిత కుటుంబాల ఆవేదన

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖ్‌నవూ అలీగంజ్‌‌లో సోమవారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 13 మంది విద్యార్థులు సహా మెుత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ

లఖ్ నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Andhra Jyothy1 Jul 2026
లఖ్ నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

లఖ్‌నవూలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (PMNRF) నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికీ రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలీగంజ్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఈ అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనలో దాదాపు 14 మంది మృతి చెందినట్లు సమాచారం. లఖ్‌నవూ కోచింగ్ సెంటర్ అగ్నిప్రమాద స్థలాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. అగ్నిప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో కొంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించి నివేదిక అందించాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ), అదనపు ప్రధాన కార్యదర్శి (హోం)లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. భూ వివాదం.. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి.. భారత్‌కు సహాయం.. కీలక ఆయుధాల సర్వీసులకు అమెరికా సిద్ధం

లఖ నవ అగ న ప రమ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in