
లైవ్‌నెస్ అథెంటికేషన్ ప్రక్రియలో నిర్ధారణ కాని, అందని లక్షమంది వివరాలు మిగతావి ఫొటోలు క్యాప్చర్ కానివి, ఆధార్ సంబంధిత సమస్యలు, వలసలు.. లబ్ధిదారుల్లో పెద్ద భవనాలు, కార్లు, ట్రాక్టర్ల యజమానులు సాక్షి, హైదరాబాద్: చేయూత పథకం కింద బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల ‘లైవ్‌నెస్ అథెంటికేషన్’(ప్రతి ఇంటికీ వెళ్లి పరిశీలన) ప్రక్రియలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ విధానం ద్వారా పింఛన్లు పొందుతున్న 19 లక్షలకు పైగా లబ్ధిదారుల్లో (పోస్ట్ ఆఫీస్‌లు, ఇతర రూపాల్లో మొత్తం కలిపి 41 లక్షల మందికి పైగా పింఛన్లు పొందుతున్నారు) ఇప్పటివరకు దాదాపు 16 లక్షల మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి కాగా.. వీరిలో దాదాపు లక్ష వరకు పింఛన్లకు సంబంధించి వివరాలు నిర్ధారణ కాలేదు లేదా అందలేదు. వీరిలో 40 వేలకు పైగా మరణించిన వారు కాగా, ఫొటోలు క్యాప్చర్ కానివి 28 వేలు, ఆధార్‌కార్డు సమస్యలు 12 వేలు, ట్రేస్ కానివి, వలసలు, అథెంటిఫికేషన్‌కు రానివి 14–15 వేల దాకా ‘లైవ్‌నెస్ ఆథెంటికేషన్’లో వెల్లడైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా మరో 4 వేల మంది ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణలో పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో బ్యాంక్ ఖాతాల ద్వారా పింఛను పొందుతున్న వారు 23 వేల మంది దాకా ఉండగా..దాదాపు 5 వేల వరకు చనిపోయిన, క్యాప్చర్ కాని, ఆధార్ సమస్యలు, వలసలు తదితర కేసులు ఉన్నట్టు తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 734 పింఛన్లకు గాను దాదాపు 167 మంది, నల్లగొండ జిల్లాలో 1,500కు గాను 300 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 20 వేల మందికి గాను 3 వేల మంది, కామారెడ్డి జిల్లాలో 13 వేల మందికి గాను 2 వేల మంది, ములుగు జిల్లాలో 8 వేల మందికి గాను వెయ్యి మంది సరైన నిర్ధారణ లేనప్పటికీ పింఛను ప్రయోజనం పొందుతున్నట్టు వెల్లడైంది. పిల్లలకు లక్షకు