Flex Fuel Car: ఇప్పుడు ఎక్కడ చూసిన ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది 2026, ఏప్రిల్ 1 నుంచే ఈ20 పెట్రోల్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే ఈ50, ఈ85, ఈ100 పెట్రోల్ అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను తయారు చేయాలని ఇప్పటికే కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) తన ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వ్యాగన్ ఆర్ బయో ఫ్లెక్స్ కారును ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసింది. జూన్ నెల ప్రారంభంలోనే ఈ కారును ధర, ఇతర వివరాలేవీ లేకుండా లాంచ్ చేసింది. అయితే తాజా ఈ బయో ఫ్లెక్స్ కారు ధరను వెల్లడించింది.వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ కారు ధర రూ.7.24 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర) నుంచి ప్రారంభమవుతున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. అదే పెట్రోల్ వేరియంట్ వ్యాగన్ ఆర్ కారు టాప్ మోడల్ ధరతో పోలిస్తే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ధర రూ.86 వేలు అధికంగా ఉంది. ఈ కారు E20 నుంచి E85 వరకు పెట్రోల్‌లో ఇథనాల్ కలిపిన మిశ్రమంతో నడుస్తుందని మారుతీ సుజుకీ తెలిపింది. అయితే, బయో ఫ్లెక్స్ వెర్షన్‌ను తొలుత కమర్షియల్ వినియోగానికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. ఈ చిన్న కారు చిన్న ఫ్యామిలీ కోసం మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.ప్రస్తుతం క్యాబ్ కోసం ప్రత్యేకంగా వ్యాగన్ ఆర్ టూర్ H3 కారును మారుతీ సుజుకీ మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్‌తో నడిచే ఈ కారు ధర రూ.4.99 లక్షల నుంచి రూ.5.89 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర) వరకు ఉంటుందని తెలిపింది. అయితే ఈ పెట్రోల్ కారు ధరతో పోలిస్తే బయో ఫ్లెక్స్ వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్
Actor ProfilePolitician
రూ.7.24 లక్షలకే ' 85 పెట్రోల్ 'తో నడిచే కారు.. చిన్న ఫ్యామిలీకి బెస్ట్.. మారుతీ సుజుకీ ధరల
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Jun 2026
రూ.7.24 లక్షలకే ' 85 పెట్రోల్ 'తో నడిచే కారు.. చిన్న ఫ్యామిలీకి బెస్ట్.. మారుతీ సుజుకీ ధరల