
రాహుల్ గాంధీ పుట్టిన రోజున రైతు డిక్లరేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి బొందపెట్టారని హరీశ్ రావు విమర్శించారు. ధాన్యం ఏదైనా కనీస మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇస్తామని నాడు రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. సిద్దిపేట, జూన్19: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం నాడు రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషం కక్కారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన జన్మదినం రోజే ఆ డిక్లరేషన్‌ను తెలంగాణ సీఎం బొందపెట్టారని హరీశ్ రావు విమర్శించారు. ధాన్యం ఏదైనా కనీస మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇస్తామని నాడు రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించారని గుర్తు చేశారు. కేంద్రం చెప్పిందే కొంటాం.. ఎంత కొనమంటే అంతే కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) నిర్ణయించిన పంటలను మాత్రమే కొంటామంటే ఇక మీరెందుకు? అని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన నిలదీశారు. పేపర్ లెస్ కేబినెట్ అన్నారని.. కానీ మీది విశ్వాసం లేని కేబినెట్ అని రేవంత్ రెడ్డి మంత్రి వర్గాన్ని ఆయన అభివర్ణించారు. మీది విశ్వాఘాతుక ప్రభుత్వమని రేవంత్ రెడ్డి సర్కారుపై నిప్పులు చెరిగారు. పంట కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తన బాధ్యత నుంచి తప్పించుకుంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కొన్నా కొనకపోయినా.. అన్ని పంటలు కొన్నది కేసీఆర్ ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు. తన నిర్ణయం మార్చుకోవాలని రేవంత్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. కేంద్రం ఎంఎస్‌పి ప్రకటిస్తుంది తప్ప