
యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ‘వార్ 2’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అసలు ఈ సినిమా ఎన్టీఆర్ ఎందుకు చేశాడా? అని టైగర్ ఫ్యాన్స్ కాస్త ఫీల్ అయ్యారు. కానీ, ఈసారి అదిరిపోయేలా ప్లాన్ చేశారు యష్ రాజ్ ఫిలింస్ వారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో ‘ఆల్ఫా’ అనే స్పై థ్రిల్లర్ తెరకెక్కించారు. ‘YRF స్పై యూనివర్స్’ నుండి వస్తున్న మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ స్పై ఫిల్మ్ కావడంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. ఈ మధ్య ఎంత పెద్ద సినిమా అయినా సరే.. ట్రైలర్‌తోనే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఆల్ఫా ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రైలర్ కట్ రాలేదన్నట్టుగా ఉంది. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ట్రైలర్ కట్ చేశారు. అలియా భట్ చేసిన పవర్‌ఫుల్ స్టంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్‌గా నిలిచాయి. ఆమెకు తోడుగా మరో యంగ్ బ్యూటీ శార్వరి కూడా అదిరిపోయే యాక్షన్‌తో అదరగొట్టింది. బాబీ డియోల్ తనదైన విలనిజం మెప్పించారు. అయితే, ఈ ట్రైలర్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్ ఏంటంటే.. హృతిక్ రోషన్ క్యామియో రోల్. అలాగే.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. కాగా వచ్చే జూలై 3న ‘ఆల్ఫా’ థియేటర్లలో విడుదల కానుంది. మొత్తంగా.. రెండున్నర నిమిషాల ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి