రాష్ట్రం రావణ కాష్టం కావాలా
Actor ProfilePolitician

రాష్ట్రం రావణ కాష్టం కావాలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాష్ట్రం రావణ కాష్టం కావాలా
Sakshi25 Aug 2026
రాష్ట్రం రావణ కాష్టం కావాలా

చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హైకోర్టు పోలీసులు ఏం చేసినా అడిగే వారు లేరనుకుంటున్నారా?.. చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు కొన్ని ప్రమాణాలుండాలంటూ ప్రభుత్వ న్యాయవాదిపైనా అసహనం.. ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించకూడదని హితవు మూడేళ్ల లోపు శిక్ష పడే కేసులను మూడేళ్లు దాటాక కోర్టులు విచారణకు స్వీకరించలేవు సీఆర్‌పీసీలో దీనిపై స్పష్టమైన నిషేధం ఉందని స్పష్టీకరణ 2021లో నమోదైన కేసులో ఇప్పుడు ప్రాసిక్యూషన్‌కు అనుమతిపై తీవ్ర అభ్యంతరం వివరాలు సమర్పిస్తామని కోర్టులో చార్జిషిట్‌ దాఖలు చేస్తారా? ప్రాసిక్యూషన్‌ ఉత్తర్వులపై తదుపరి చర్యలన్నీ నిలిపివేత సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల అడ్మినిస్ట్రేషన్‌ ఏ మాత్రం సక్రమంగా లేదు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)ని ఉల్లంఘిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. రూల్‌ ఆఫ్‌ లా అనేది ఒకటి ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా సరే రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. రాష్ట్రం రావణకాష్టంగా ఉండాలని అనుకుంటున్నారా? శాంతి, సామరస్యం అవసరం లేదని భావిస్తున్నారా? పోలీసులు ఏం చేస్తున్నా అడిగే వారు లేరనుకుంటున్నారా? లేక మీరే తెలివైన వాళ్లు అనుకుంటున్నారా? కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా?’ అంటూ మంగళవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రత్యేకించి పోలీసు శాఖపై నిప్పులు చెరిగింది. ఒక నేత దాఖలు చేసిన పిటిషన్‌లో పూర్తి వివరాలను హైకోర్టు ముందుంచేందుకు సమయం తీసుకున్న పోలీసులు, దానిని అడ్డం పెట్టుకుని ఆ వెంటనే కింది కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ‘వివరాలు సమర్పించేందుకు సమయం తీసుకుని చార్జిషీట్‌ ఎలా దాఖలు చేస్తారు? ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే. పోలీసులు, కలెక్టర్‌కు గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉంది. పోలీసులు, కలెక్టర్‌ను కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశిస్తున్నా. వివరాల సమర్పణ కోసం పోలీసులు సమయం కోరినప్పుడు, కోర్టు సమయం ఇవ్వడం పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది. పోలీసులు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అధికారులు ఇల్లు కూల్చి వేస్తున్నారంటూ కక్షిదారుడు పిటిషన్‌ దాఖలు

ర ష ట ర ర వణ క ష ట క వ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in