రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సహకరించండి
Actor ProfilePolitician

రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సహకరించండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సహకరించండి
Eenadu3 Jul 2026
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సహకరించండి

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు మంత్రి శ్రీధర్‌బాబు వినతి పీయూష్‌ గోయల్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న శ్రీధర్‌బాబు ఈనాడు, దిల్లీ: తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 లక్ష్య సాధన కోసం రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సహకరించాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. దిల్లీలో సోమవారం కేంద్ర మంత్రితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌సిటీలో రూ.8,500 కోట్ల పెట్టుబడితో గ్లోబల్‌ ఇన్నోవేషన్, ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఏర్పాటుకు హ్యుందాయ్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. అక్కడ లాజిస్టిక్స్‌ అభివృద్ధికి కేంద్రం చొరవ చూపాలి. భవ్య స్కీం ఫేజ్‌-1లో భాగంగా రాష్ట్రంలో 15 నుంచి 20 ప్లగ్‌ అండ్‌ ప్లే ఇండస్ట్రియల్‌ పార్కుల అభివృద్ధికి రాష్ట్రం డీపీఆర్‌లను సిద్ధం చేస్తోంది. వీటికి త్వరగా అనుమతిస్తే తయారీ రంగం మరింత బలోపేతం అవుతుంది’ అని కేంద్ర మంత్రికి తెలియజేశారు. హైదరాబాద్‌లో నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానికి కేంద్రం చొరవ చూపాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం యూరియాను తెలంగాణకే కేటాయించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ర ష ట ర ప ర శ ర మ క ప రగత క సహకర చ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in