సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్'. ఇందులో దీపా థామస్ హీరోయిన్ గా నటించింది. వెంకటేష్ మహా ఈ మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, వరల్డ్ ఆఫ్ రావు బహదూర్ వీడియో, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా మహేష్ ఈ మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.మహేష్ బాబు ఇటీవలే 'రావు బహదూర్' సినిమాని చూశారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ''రావు బహదూర్... ఇది మిమ్మల్ని కాలర్ పట్టుకుని లాగే సినిమా మాత్రమే కాదు, మీ చర్మంలోకి చొచ్చుకుపోయే సినిమా కూడా!!! విచిత్రంగా, అందంగా, ఇంటెన్స్ డ్రామాతో ఉంటుంది. వెంకటేష్ మహా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు.. సత్యదేవ్ తనదైన శైలిలో ఆ ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు!!! దీపా థామస్ తన అద్భుతమైన నటనతో మెరిసింది.. అద్భుతమైన నటీనటులు, అత్యుత్తమ సాంకేతిక బృందం కలిసి ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి టీమ్ ని చూసి చాలా గర్వంగా ఉంది. జూలై 3వ తేదీ నుండి వెండితెరపై రావుబహదూర్ ను, అతని మ్యాడ్ నెస్ ని చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని మహేష్ పేర్కొన్నారు.మహేష్ బాబు పోస్టుపై హీరో సత్యదేవ్ స్పందిస్తూ, సంతోషం వ్యక్తం చేశారు. ''మన ప్రియమైన గ్లోబ్‌ట్రాటర్.. కాస్త సమయం కేటాయించి 'రావు బహదూర్' సినిమా కోసం ఈ అద్భుతమైన రివ్యూని అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కొన్ని ప్రశంసలు మనతో శాశ్వతంగా నిలిచిపోతాయి. థ్యాంక్యూ మహేష్ సర్, మీ మాటలు ఈ ప్రయాణాన్ని మరింత మెమరబుల్ గా మార్చాయి. మేము సృష్టించిన ఈ విచిత్రమైన, అందమైన ప్రపంచంతో మీరు కనెక్ట్ అవ్వడం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. సినిమా విడుదలకు

Samayam Telugu•21 Jul 2026
రావు బహదూర్’పై మహేష్ బాబు ఫస్ట్ రివ్యూ.. ఇది మిమ్మల్ని కాలర్ పట్టుకుని లాగే సినిమా మాత్రమే కాదు
Eenadu•13 Jun 2026
రావు బహదూర్ ’ గురించి ఇతర ఇండస్ట్రీలూ మాట్లాడుకుంటాయిఏ భాషలో మంచి సినిమా వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నటుడు సత్యదేవ్ అన్నారు. జులై 3న ‘రావు బహదూర్’ విడుదలైన తర్వాత ఇతర ఇండస్ట్రీలూ దీని గురించి మాట్లాడుకుంటాయన్నారు. సత్యదేవ్ ప్రధానపాత్రలో...