రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ హాఫ్ డిజాస్టర్
Actor ProfilePolitician

రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ హాఫ్ డిజాస్టర్

Total News1
Movie Updates0
Sources1
రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ హాఫ్ డిజాస్టర్
TeluguOne14 Jun 2026
రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ హాఫ్ డిజాస్టర్

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. తాజాగా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సినిమా పరిభాషను వాడుతూ రేవంత్ రెడ్డి పాలనను అత్యంత ఘాటుగా విమర్శించారు. సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే అది హిట్టా లేదా ఫట్టా అని ప్రేక్షకులు ఎలా అంచనా వేస్తారో, అదే విధంగా తెలంగాణ ప్రజలు కేవలం కొన్ని నెలల కాంగ్రెస్ పాలనను చూసి ఒక స్పష్టమైన తీర్పుకు వచ్చేసారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికే ఇంటర్వెల్ పడిపోయిందని, వారి పాలనలో మొదటి సగం అంటే 'ఫస్ట్ హాఫ్' పూర్తిగా డిజాస్టర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలను నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, నిరాశతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. కొత్తగా ఇళ్ళు కట్టడం చేతకాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోందని మండిపడ్డారు. పేదలకు అందించాల్సిన వివిధ సంక్షేమ పథకాల ఆర్థిక సహాయాల విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలను పెంచుకుంటూ పోతోందని, లబ్ధిదారులకు పైసలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లను

ర వ త ర డ డ ప లన ఫస ట హ ఫ డ జ స టర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in