రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు
Actor ProfilePolitician

రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు

Total News1
Movie Updates0
Sources1
రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు
Sakshi15 Jun 2026
రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తన గురువు చంద్రబాబు ఎపిలో 2018లో సేవా మిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించినట్లే,బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గ, బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏల ఎస్ఐఆర్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బిజేపి పార్టీ,కాంగ్రెస్ పార్టీ కలిసే ఉన్నాయని,ఆ రెండు పార్టీలు ఒక్కటై,తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలనే కుట్రతో,ఓట్లు తొలగించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల సమయంలో ఎస్ఐఆర్ నిర్వహించి సుమారు 90 లక్షల ఓట్లు తొలగించి,మమత బెనర్జీ పార్టీని ఓడించారని తెలిపారు. బిజేపి అధికారంలోకి వచ్చాక అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలన్నారు. మాజీ మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓటు గల్లంతయ్యిందని, బెంగళూరులో రాహుల్ ద్రావిడ్ కూడా ఓటు వినియోగించలేకపోయారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏమరుపాటుగా ఉంటే మన ఓటు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్యుమరేషన్ ఫారం నింపిన తర్వాత, వ్యక్తికి నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు,ఓటు తొలగించాలంటే ఖచ్చితంగా నోటీసు ఇవ్వాల్సిందేనన్నారు. అంతేకాకుండా 326 ప్రకారం ఎవరైనా వ్యక్తులు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే, రిప్రజెంటేషన్ ఈఫ్ పీపుల్ యాక్ట్ 1950 లోని సెక్షన్ 17,18 ప్రకారం ఏడాది పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు.2028లో కేసీఆర్ గారిని తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే బిఎల్ఏలే ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారికి,నూతన ఓటు నమోదు చేయడానికి ఫారం 6 నింపి ఇవ్వాలని, బిజేపి,కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బిఎల్ఓ లను ప్రభావితం