
అమెరికా వెళ్లాలని పరితపించే భారతీయ విద్యార్ధుల ఆశలను రోజురోజుకూ చంపేస్తుంది అగ్రరాజ్యం. విదేశీ విద్యార్థుల పట్ల దశాబ్దాలుగా ఉన్న సానుకూల వాతావరణాన్ని మార్చేస్తూ అమెరికా ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి, అక్కడ నివసించడానికి ఉద్దేశించిన డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ (D/S) విధానాన్ని రద్దు చేసే ప్రతిపాదనలకు శ్వేతసౌధం (వైట్‌హౌస్) తుది ఆమోదం తెలిపింది.డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తీసుకొచ్చిన ఈ నూతన వలస నిబంధనల ఫైలుపై ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్’ (OMB) ఆమోద ముద్ర వేసింది. మరికొద్ది రోజుల్లోనే ఇది ఫెడరల్ రిజిస్టర్’లో అధికారికంగా ప్రచురితం కానుంది. ఆ వెంటనే కొన్ని వారాల వ్యవధిలోనే ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది.ఏమిటీ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’? కొత్తగా రాబోతున్న మార్పు ఏంటి?ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ఒక విద్యార్థి ఎఫ్-1 (F-1) వీసాపై అమెరికాలో అడుగుపెడితే, అతను ఎంచుకున్న కోర్సు పూర్తయ్యేంత వరకు (అది ఐదేళ్లయినా, ఏడేళ్లయినా) చట్టబద్ధంగా అక్కడ కొనసాగవచ్చు. మధ్యలో కోర్సులు మార్చాలన్నా, ఒక యూనివర్సిటీ నుంచి మరో దానికి బదిలీ అవ్వాలన్నా, ఉన్నత చదువులకు వెళ్లాలన్నా అదనపు అనుమతులు అవసరం లేకుండానే ఉండే వెసులుబాటు ఉండేది.కానీ, రాబోయే కొత్త విధానం ఈ స్వేచ్ఛను పూర్తిగా హరిస్తుంది. దీని స్థానంలో ఫిక్స్‌డ్ అడ్మిషన్ పీరియడ్’ (నిర్ణీత కాల పరిమితి) అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం విద్యార్థులకు గరిష్టంగా నాలుగేళ్ల కాలపరిమితిని మాత్రమే విధిస్తారు. ఒకవేళ ఆ లోపు చదువు పూర్తి కాకపోతే, వారు అమెరికాలోనే కొనసాగడానికి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ (USCIS) నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా వీసా పొడిగింపు (Extension) కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.భారతీయ పరిశోధకులకు అగ్నిపరీక్ష!అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులదే సింహభాగం. 2024-25 విద్యా సంవత్సర గణాంకాల ప్రకారం సుమారు 3.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. అంటే ప్రతి