రాలిపోయే పువ్వా పాటకు జాతీయ అవార్డు.. తిరిగి ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే
Actor ProfileActor

రాలిపోయే పువ్వా పాటకు జాతీయ అవార్డు.. తిరిగి ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాలిపోయే పువ్వా పాటకు జాతీయ అవార్డు.. తిరిగి ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే
TV9 Telugu26 Jul 2026
రాలిపోయే పువ్వా పాటకు జాతీయ అవార్డు.. తిరిగి ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే

తెలుగు సినిమా చరిత్రలో మాతృదేవోభవ చిత్రం ఒక ఎమోషనల్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ చిత్ర విజయానికి కీరవాణి సంగీతం, ప్రత్యేకించి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకని అనే పాట ఎంతగానో దోహదపడింది. అయితే ఈ పాటకు జాతీయ అవార్డు లభించినప్పుడు, ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి దానిని స్వీకరించడానికి నిరాకరించడం వెనుక ఒక గొప్ప త్యాగం ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తాజాగా ఈ విషయాన్ని సినిమా దర్శకుడు కె. అజయ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జాతీయ అవార్డును తిరస్కరించడానికి వేటూరి చూపిన కారణం “తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించలేదు” అనేది. ఈ నిర్ణయం కేవలం ఒక వ్యక్తిగత అవార్డుకు సంబంధించినది కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి సంబంధించినదని అజయ్ కుమార్ వివరించారు. అవార్డు ప్రకటించినప్పుడు, అజయ్ కుమార్ వేటూరిని ఆ అవార్డును స్వీకరించమని బతిమిలాడారు. దానికి వేటూరి “వద్దు అజయ్, నువ్వు సినిమా కష్టపడి చేశావు, పిక్చరైజేషన్ బాగా ఉండటం వల్ల కూడా వచ్చింది. నీ బాధ నాకు తెలుసు. కానీ ఇది కేవలం నాకు వచ్చిన వ్యక్తిగత అవార్డు. నేను ఎంత ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానో చూడు. నాకు ఒక్కడి కోసమని కాదు, మన జాతి, మన భాష కోసం” అని అన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ చర్చ తర్వాత, వేటూరి నిర్ణయానికి అజయ్ కుమార్ కూడా కన్విన్స్ అయ్యారట. తెలుగు భాషాభిమానం, ఆత్మగౌరవం విషయంలో వేటూరి నిబద్ధతను ఇది తెలియజేస్తుంది. అవార్డు వచ్చిందనే విషయం ఎక్కువ మందికి తెలిసినా, ఆయన తిరస్కరించారనే నిజం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని అజయ్ కుమార్ అన్నారు. అందుకు కారణం కూడా చాలా మందికి తెలియదని అన్నారు. ఇది ప్రజల్లోకి వెళ్ళాలని, వేటూరి త్యాగం అందరికీ తెలియాలని ఆయన కోరారు. మాతృదేవోభవ సినిమా నిర్మాణ వ్యయం 1993లో కేవలం 30 లక్షలు