రియల్ ఎస్టేట్ ను దాటేసిన క్రిప్టో క్రేజ్.. వేల కోట్లు సంపాదించిన ట్రంప్
Actor ProfilePolitician

రియల్ ఎస్టేట్ ను దాటేసిన క్రిప్టో క్రేజ్.. వేల కోట్లు సంపాదించిన ట్రంప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రియల్ ఎస్టేట్ ను దాటేసిన క్రిప్టో క్రేజ్.. వేల కోట్లు సంపాదించిన ట్రంప్
Oneindia Telugu27 Aug 2026
రియల్ ఎస్టేట్ ను దాటేసిన క్రిప్టో క్రేజ్.. వేల కోట్లు సంపాదించిన ట్రంప్

సాధారణంగా వ్యాపారవేత్త అనగానే రియల్ ఎస్టేట్, హోటళ్లు, గోల్ఫ్ క్లబ్బులు గుర్తుకు వస్తాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యం కూడా ఇన్నాళ్లూ వీటిపైనే నడిచింది. కానీ, మారుతున్న కాలంతో పాటు ట్రంప్ తన రూట్ మార్చారు. సాంప్రదాయ వ్యాపారాలను పక్కనబెట్టి డిజిటల్ కరెన్సీపై కన్నేసిన ఆయన.. అక్కడ ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించుకున్నారు. తన క్రిప్టోకరెన్సీ, మీమ్‌కాయిన్ వ్యాపారాల ద్వారా 2025 సంవత్సరంలో ఏకంగా 1.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,800 కోట్లు)కు పైగా ఆదాయాన్ని ఆర్జించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అమెరికా ప్రభుత్వ నైతికత విభాగం (OGE) విడుదల చేసిన 927 పేజీల విస్తృతమైన వార్షిక ఆర్థిక నివేదికలో ఈ సంచలన విషయాలు అధికారికంగా వెల్లడయ్యాయి.క్రిప్టో, మీమ్‌కాయిన్లతోనే కాసుల వర్షం!ట్రంప్ సంపాదనలో సింహభాగం డిజిటల్ అసెట్స్ ద్వారానే రావడం గమనార్హం. ప్రధానంగా ట్రంప్, ఆయన కుమారులు సహ వ్యవస్థాపకులుగా ఉన్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో సంస్థ ద్వారా 594 మిలియన్ డాలర్ల భారీ ఆదాయం లభించింది. అలాగే ఆయనకు చెందిన మీమ్‌కాయిన్ వ్యాపార సంస్థ సీఐసీ డిజిటల్ ఎల్‌ఎల్‌సీ రాయల్టీల రూపంలో మరో 636 మిలియన్ డాలర్లను ఆర్జించింది. దీనితో పాటు స్టేబుల్‌కాయిన్ హోల్డ్‌కో వాటాల విక్రయం ద్వారా కూడా ట్రంప్‌కు దాదాపు 197 మిలియన్ డాలర్లు సమకూరాయి. ఇలా అన్ని రకాల డిజిటల్ మార్గాల ద్వారా ఆయన ఖజానా నిండిపోయింది.రియల్ ఎస్టేట్‌ను వెనక్కి నెట్టిన డిజిటల్ పవర్!ట్రంప్ బ్రాండ్‌గా మారిన రియల్ ఎస్టేట్, హోటల్ సామ్రాజ్యం కంటే ఈ క్రిప్టో ఆదాయమే చాలా రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఆయనకు చెందిన ప్రసిద్ధ మార్-ఎ-లాగో రిసార్ట్ ద్వారా కేవలం 77 మిలియన్ డాలర్లు, వర్జీనియా గోల్ఫ్ క్లబ్ ద్వారా 25 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ట్రంప్ మొత్తం నికర ఆస్తి విలువ ప్రస్తుతం 7.6 బిలియన్ డాలర్లుగా అంచనా