రొమాంటిక్ గా ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్.. పోస్టర్ వైరల్
Actor ProfileActor

రొమాంటిక్ గా ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్.. పోస్టర్ వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రొమాంటిక్ గా ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్.. పోస్టర్ వైరల్
Chitrajyothy21 Jul 2026
రొమాంటిక్ గా ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్.. పోస్టర్ వైరల్

కేఎం (కృష్ణమోహన్‌), పూజా సుందర్‌ శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఇట్స్ లైఫ్‌ బ్రో’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని హీరో నితిన్ విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. కేఎం (కృష్ణమోహన్‌), పూజా సుందర్‌ శెట్టి (Pooja Sundar Shetty) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఇట్స్ లైఫ్‌ బ్రో’ (It’s Life Bro). కేఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ (KM Entertainments) పతాకంపై కృష్ణ మోహన్‌ సల్లగుండ్ల (Krishna Mohan Sallagundla) స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమశేఖర్‌ రెడ్డి (Somashekar Reddy) దర్శకత్వంలో వైవిధ్యమైన కథాంశంతో, ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రామిసింగ్‌ హీరో నితిన్‌ (Hero Nithiin) విడుదల చేసి, చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సోమశేఖర్ రెడ్డి చిత్ర విశేషాలను పంచుకుంటూ.. ‘‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ భావోద్వేగ ప్రేమకథను తెరకెక్కిస్తున్నాం. వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకం మాకుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు గుండెల్ని పిండేసే బలమైన ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల, చమ్మక్‌ చంద్ర, అంబటి శ్రీనివాస్‌, దేవి ప్రసాద్‌, కిరీటి, త్రిశూల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇ.రాజయ్య కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. చైతన్య సినిమాటోగ్రఫీ (డీఓపీ) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంగీత దర్శకుడు సాహిత్య సాగర్‌ బాణీలు సమకూరుస్తుండగా, సత్య గిద్దుటూరి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు