రామోజీ గ్రూప్ ఎప్పటినుంచో మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తోంది
Actor ProfileActor

రామోజీ గ్రూప్ ఎప్పటినుంచో మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తోంది

Total News1
Movie Updates0
Sources1
రామోజీ గ్రూప్ ఎప్పటినుంచో మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తోంది
Eenadu16 Jun 2026
రామోజీ గ్రూప్ ఎప్పటినుంచో మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తోంది

యంగ్ టాలెంట్‌ను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌కు నటుడు విజయ్‌ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. శ్రీనిధి యూనివర్సిటీ టీజీ 20 టైటిల్ స్పాన్సర్‌గా ఉండనుందని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 21 నుంచి ఉప్పల్ స్టేడియంలో మెగా క్రికెటింగ్ ఈవెంట్ జరుగుతుందని టీజీ 20 గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు తెలిపారు. టీజీ20 లీగ్ ప్రారంభ మ్యాచ్‌కు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్, లేజర్ షో ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బేగంపేట్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశానికి హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు, హెచ్‌సీఏ ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌ తరఫున ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి, ఇతర ఫ్రాంచైజీ యజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, రామోజీ గ్రూప్‌ ఎప్పటినుంచో మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తోందని హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌ ప్రతినిధి బృహతి తెలిపారు. ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్, ఈనాడు ఛాంపియన్ పేజీ రూపంలో ప్రతిభను వెలికితీస్తోందని వివరించారు. ఈ వార్త చదివారా: తెలంగాణ అభివృద్ధిపై మాకెవరూ పాఠాలు చెప్పనక్కర్లేదు: కిషన్‌రెడ్డి

ర మ జ గ ర ప ఎప పట న చ మట ట ల మ ణ క య లన వ ల క త స త ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in