రామ్ చరణ్ పేరు మర్చిపోయిన క్లీంకార.. వార్నింగ్ ఇచ్చినా వదలని చిరంజీవి మనవరాలు
Actor ProfileActor

రామ్ చరణ్ పేరు మర్చిపోయిన క్లీంకార.. వార్నింగ్ ఇచ్చినా వదలని చిరంజీవి మనవరాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రామ్ చరణ్ పేరు మర్చిపోయిన క్లీంకార.. వార్నింగ్ ఇచ్చినా వదలని చిరంజీవి మనవరాలు
Asianet News Telugu11 Jul 2026
రామ్ చరణ్ పేరు మర్చిపోయిన క్లీంకార.. వార్నింగ్ ఇచ్చినా వదలని చిరంజీవి మనవరాలు

రామ్‌ చరణ్‌ ఇటీవల `పెద్ది` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. వెంకట్‌ సతీష్‌ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 4న విడుదలై బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. టాక్‌ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లని రాబట్టింది. దీంతో మంగళవారం పెద్ది మూవీ బ్లాక్‌ బస్టర్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు జనాలు అంతా తనని పెద్ది అనే పిలుస్తున్నారని, రామ్‌ చరణ్‌ అనే పేరుని మర్చిపోయారని తెలిపారు. తన ఇంట్లోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని, తన కూతురు క్లీంకార కూడా తనని పెద్ది అనే పిలుస్తుందని చెప్పారు. `బయటే కాదు ఇంట్లో కూడా నా పేరుని మర్చిపోయారు. మా బుడ్డది క్లీంకార.. `పెద్ది`కి ముందు నాన్న నాన్న అని పిలిచేది. కానీ పెద్ది చూశాక.. `ఏయ్‌ పెద్ది` అని పిలుస్తోంది. తప్పు అమ్మ.. నాన్నని అలా పిలవొద్దు అని చెప్పినా వినడం లేదు. అంతగా తన పాత్రని అందరు హోన్‌ చేసుకున్నారు` అని తెలిపారు రామ్‌ చరణ్‌. ఆయన ఇంకా మాట్లాడుతూ, `కొన్ని విజయాలు మనల్ని ఆనందపరుస్తాయి. కొన్ని విజయాల గురించి ఆలోచిస్తే మనసుకు చాలా తృప్తిని ఇస్తాయి. `పెద్ది` విజయం మాత్రం నా జీవితాన్నే మార్చేసింది. పెద్ది లాంటి అనుభూతి నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. అలాంటి గొప్ప అనుభూతిని ప్రేక్షకులు నాకు అందించారు. ఈ సినిమా ద్వారా నా గుండెల్లో జీవితాంతం దాచుకునే జ్ఞాపకాన్ని ఇచ్చారు. అందుకే ముందుగా మీ అందరికీ థాంక్యూ. నేను సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే చాలా కొత్త ఆడియన్స్ థియేటర్లకు వచ్చినట్లు అనిపించింది. చిన్న పిల్లలు ‘మస్సా మస్సా’ పాటకు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. పేరెంట్స్ ఎంత