
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అలరించి ఆతర్వాత సహాయక పాత్రలతో మెప్పిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్న నటీమణి ఎవరో కాదు రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాధికా. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా సినిమాలు చేశారు రాధికా. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకున్నారు. యంగ్ హీరోహీరోయిన్లకు అమ్మగా, అత్తగా నటిస్తున్నారు. అంతేకాదు రాజకీయాల్లోనూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే రాధికా శరత్ కుమార్ చెల్లి తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అని మీకు తెలుసా.? అవును రాధికా శరత్ కుమార్ మాత్రమే కాదు ఆమె చెల్లి కూడా తెలుగులో హీరోయిన్ గా రాణించారు. ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఆమె అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె ఎవరో కాదు నిరోషా. సింధూర పువ్వు సినిమాతో కుర్రకారు హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంటి నటి నిరోషా రాధ. అప్పట్లో తన అందం, అభినయంతో అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ మరెవరో కాదు స్టార్ హీరోయిన్ రాధిక చెల్లెలు. కోలీవుడ్ ప్రముఖ నటుడు ఎం.ఆర్. రాధా కూతురు కూడా. రాధికా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ సొంతం చేసుకన్నాక నిరోషా వెండితెరకు పరిచయమైంది. అగ్ని నక్షత్రం ఆమె మొదటి సినిమా. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో ఘర్షణ పేరుతో రిలీజ్ అయ్యింది. తెలుగులో నిరోషా.. ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ ,కొబ్బరి బోండాం, డిటెక్టివ్ నారద,అత్తింట్లో అద్దె మొగుడు, ముగ్గురు