
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish Rao Challenge: 'తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాయితం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి ఉద్యమం గురించి, త్యాగాల గురించి మాట్లాడుతుంటే నవ్విపోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది ఆయన తీరు' అని అసహనం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజల జోష్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. జడ్చర్లలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు. 'హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ అని పెడుతున్నాడు. అది రైతు ఆశీర్వాద సభ కాదు రైతుల వంచన సభ' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రైతును వంచించుతూనే ఉన్నాడని ఆరోపించారు. 'యాసంగి రైతు బంధు ఎగొట్టి ఇప్పుడు మళ్లీ వానాకాలం రైతుబంధు వేస్తానని మోసం చేస్తున్నాడు. రైతు రుణమాఫీ రూ.2 లక్షలు కాదు కదా రూ.లక్ష లోపు ఉన్నవాళ్లకు కూడా చెయ్యలేదు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నల్గొండలో ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు. ఆ ఒట్టు అనేదానికి ప్రాణం ఉంటే ఈ రేవంత్ రెడ్డి అబద్ధాలకు ఉరేసుకొని ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేది. కనిపించిన దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా దేవుళ్లనే మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. 'పాలమూరు