రాత్రికి వస్తేనే రెమ్యూనరేషన్! కోరిక తీరిస్తేనే సినిమా ఛాన్స్
Actor ProfileActor

రాత్రికి వస్తేనే రెమ్యూనరేషన్! కోరిక తీరిస్తేనే సినిమా ఛాన్స్

Total News1
Movie Updates0
Sources1
రాత్రికి వస్తేనే రెమ్యూనరేషన్! కోరిక తీరిస్తేనే సినిమా ఛాన్స్
Oneindia Telugu15 Jun 2026
రాత్రికి వస్తేనే రెమ్యూనరేషన్! కోరిక తీరిస్తేనే సినిమా ఛాన్స్

చిత్ర పరిశ్రమలో అవకాశాల పేరుతో నటీమణులను లొంగదీసుకోవడం, లైంగికంగా వేధించడం, ఆర్థికంగా మోసం చేయడం వంటి అరాచకాలు నిరంతరాయంగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా వెండితెరపై రాణించాలనే ఆకాంక్షతో గత కొన్ని ఏళ్లుగా సినిమా రంగంలో లీడ్ ఆర్టిస్ట్‌గా (నటిగా) కొనసాగుతున్న ఒక యువతికి క్యాస్టింగ్ విభాగంలో తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. తన శ్రమకు రావాల్సిన డబ్బులు అడిగినందుకు కారులోనే అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ప్రాణాలతో లేపేస్తానంటూ బెదిరింపులకు దిగిన క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ అనే వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.అసలేం జరిగిందంటే..?పోలీస్ రికార్డుల ప్రకారం.. ఓ నటి గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే సిద్ధు అనే స్నేహితుని ద్వారా ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పరిచయమయ్యాడు. 2025 అక్టోబర్‌లో ప్రసాద్ ఆమెకు ఫోన్ చేసి, ఆకాశంలో ఒక తార అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందని నమ్మించాడు. ఇందుకు సదరు నటి అంగీకరించడంతో 21.10.2025 నుంచి 09.12.2025 వరకు జరిగిన షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొని తన రోల్ పూర్తి చేసింది. ఇందుకు గానూ ఆమెకు రూ. 90,000 పారితోషికంతో పాటు క్యాబ్ ఖర్చులు రూ. 38,000 (మొత్తం రూ. 1,28,000) చెల్లించాల్సి ఉంది.నిర్మాత ఆఫీస్ ముందే కారులో అరాచకం!సినిమా పూర్తయ్యాక తన బకాయిల కోసం నటి సదరు క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌ను సంప్రదించగా.. ఇవాళ, రేపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. తీరా ఈ ఏడాది ఫిబ్రవరి 18న బంజారాహిల్స్ లోని ఓ ప్రముఖ నిర్మాత కార్యాలయం వద్దకు డబ్బుల నిమిత్తం రావాలని నటిని ప్రసాద్ పిలిపించాడు. అక్కడికి వెళ్లిన ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని, కొంతదూరం తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నేను చెప్పినట్లు వింటే సినిమాలో ఇంకా మంచి అవకాశాలు ఇప్పిస్తా అంటూ లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రసాద్ వేధింపుల నుంచి

ర త ర క వస త న ర మ య నర షన క ర క త ర స త న స న మ ఛ న స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in