రెండేళ్ల తర్వాత రెండో భాగం
Actor ProfileActor

రెండేళ్ల తర్వాత రెండో భాగం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండేళ్ల తర్వాత రెండో భాగం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema31 Jul 2026
రెండేళ్ల తర్వాత రెండో భాగం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సమంత (Samantha) నటించిన “మా ఇంటి బంగారం” (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాగా ఆడుతోంది. తాజాగా ఈ సినిమాకి రెండో భాగాన్ని ప్రకటించారు సినిమా సహ నిర్మాత, సమంత భర్త రాజ్ నిడిమోరు. ప్రస్తుతం సమంత గర్భవతి. సో, ఆమె కొత్తగా సినిమాలు ఒప్పుకోలేదు. మెటర్నిటీ గ్యాప్ తీసుకోబోతోంది. అందుకే, రెండో భాగం రెండేళ్ల తర్వాత స్టార్ట్ చేస్తామని రాజ్ తెలిపారు. “రెండో భాగం తీస్తాం. రెండేళ్ల తర్వాత వస్తుంది. ఇదే టీం మళ్ళీ వస్తుంది,” అని ఆయన చెప్పారు. “సమంత సినిమాలు మానేద్దమని అనుకొంది. కానీ ఒక తెలుగు సినిమా చెయ్యమని నేను పట్టుబట్టాను. అలా మా ఇంటి బంగారం మొదలైంది. ఆమె మళ్ళీ నటిస్తుంది,” అని రాజ్ సమంత మరో ఎంట్రీ గురించి తెలిపారు