రెండేళ్లు ఓపిక పట్టండి
Actor ProfilePolitician

రెండేళ్లు ఓపిక పట్టండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండేళ్లు ఓపిక పట్టండి, కాలర్ పట్టుకోండి
Oneindia Telugu20 Jun 2026
రెండేళ్లు ఓపిక పట్టండి, కాలర్ పట్టుకోండి

తెలంగాణలో పంటల కొనుగోలులో ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన జొన్న రైతు పాండురంగ వ్యవసాయ సంక్షోభం కారణంగా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆ గ్రామాన్ని సందర్శించిన కేటీఆర్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.మరణించిన పాండురంగ ఆదర్శ రైతు అని, ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 3,720 లభిస్తుందనే ఆశతో ఆ రైతు దాదాపు నెల రోజుల పాటు మార్కెట్ యార్డులోనే తన జొన్నల కుప్ప వద్ద పడిగాపులు కాశారని వివరించారు. చివరకు క్వింటాల్‌కు రూ. 50 లంచం అడిగే దుస్థితి రావడంతో తీవ్ర ఆవేదన చెందారని గుర్తుచేస్తూ కన్నీరు పెట్టారు.చివరికి అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన పాండురంగ, తానే ఎంతో కష్టపడి పండించిన పంట కుప్పపైనే విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యవసాయ రంగ దయనీయ పరిస్థితికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. రూ. లక్షన్నర గల ఆయన పంట రుణంలో కనీసం ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాకపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు.కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా రూ. 500 బోనస్ ఇవ్వకపోగా, ప్రైవేటు మార్కెట్ లో క్వింటాల్ రూ. 2,000 తక్కువ ధరకు అమ్ముకునేలా పరిస్థితి సృష్టించిందని ఆరోపించారు. ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిందని, రైతు బీమా ప్రీమియంలు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో క్లెయిమ్‌లు పెండింగ్‌లో పడ్డాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న రైతుల మరణాలు సాధారణ ఆత్మహత్యలు కావని

ర డ ళ ల ఓప క పట ట డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in